బీజేడీ చీఫ్ నవీన్ పట్నాయక్ ఈనెల 29న ఒడిశా నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ విషయాన్ని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. నవీన్ పట్నాయక్ సీఎం పదవిని చేపట్టనుండటం ఇది వరుసగా ఐదోసారి. ఇటీల జరిగిన ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేడీ 147 స్థానాలకు గాను 112 స్థానాలు కైవసం చేసుకుని సత్తా చాటింది. కాగా, బీజేపీ 23 సీట్లతో ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది. ఇక కాంగ్రెస్ 9 సీట్లకే పరిమితమైంది.