అమరావతి భూముల కుంభకోణం కేసులో చంద్రబాబుకు సీఐడీ నోటీసులు జారీ చేయడంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, చంద్రబాబు తనయుడు నారా లోకేష్ స్పందించారు. తాను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అని నమ్మించడానికి జగన్ రెడ్డి పడుతున్న తిప్పలు చూస్తుంటే నవ్వొస్తుందని వ్యాఖ్యానించారు. అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ అనే అంశమే లేదంటూ కోర్టు అనేక సార్లు చీవాట్లు పెట్టినా పాత పాటే ఎన్నాళ్లు పాడుతారంటూ వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. 21 నెలలు శోధించి అలసిపోయి ఆఖరికి రెడ్డి గారు ఇచ్చిన ఫిర్యాదుతో ఎస్సి, ఎస్టీ కేసు పెట్టే పరిస్థితికి దిగజారారని అంటూ ధ్వజమెత్తారు. సిల్లీ కేసులతో చంద్రబాబును ఏమీ చేయలేరన్నారు. అమరావతిని అంతం చెయ్యడానికి జగన్ రెడ్డి ఎన్ని కుట్రలు చేసినా, దైవభూమి తనని తానే కాపాడుకుంటుందని లోకేష్ వ్యాఖ్యానించారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి భూముల కుంభకోణంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు సీఐడీ అధికారులు నోటీసులు ఇవ్వడంపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న స్పందించారు. రాజధాని భూముల వ్యవహారంపై 21 నెలలుగా ఏం చేశారని ప్రశ్నించారు. మున్సిపల్ ఫలితాలు రాగానే అధికార మదం తలకెక్కిందని వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఏం చేసినా చెల్లుతుందని జగన్ భావిస్తున్నారని ఫైర్ అయ్యారు. చంద్రబాబును ఏదో రకంగా అంతమొందించాలని చూస్తున్నారంటూ ధ్వజమెత్తారు. రాజధాని భూముల్లో అవకతవకలు జరగలేదని హైకోర్టు తీర్పు ఇచ్చిందని బుద్ధా వెంకన్న ఈ సందర్భంగా గుర్తు చేశారు. చంద్రబాబును కించపరిచేందుకే సీఐడీ నోటీసులు జారీ చేశారన్నారు. సీబీఐ దగ్గరకు జగన్ వెళ్లినట్లు చంద్రబాబును సీఐడీ దగ్గరకు వెళ్లేలా కుట్రలు చేస్తున్నారని అన్నారు. ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజం అన్నారు. తాము ఓడినంత మాత్రాన భయపడేది లేదన్నారు. వైసీపీ చర్యలను ప్రజలంతా గమనిస్తున్నారని పేర్కొన్నారు. 2024లో తమ ప్రభుత్వం రావడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు.
21నెలలు శోధించి అలసిపోయి ఆఖరికి రెడ్డి గారు ఇచ్చిన ఫిర్యాదుతో ఎస్సి,ఎస్టీ కేసు పెట్టే పరిస్థితికి దిగజారారు.సిల్లీ కేసులతో చంద్రబాబు గారి గెడ్డం మీద మెరిసిన వెంట్రుక కూడా పీకలేరు.అమరావతిని అంతం చెయ్యడానికి జగన్ రెడ్డి ఎన్ని కుట్రలు చేసినా,దైవభూమి తనని తానే కాపాడుకుంటుంది.(2/2)
— Lokesh Nara (@naralokesh) March 16, 2021
Also Read: AP government: పేదలకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. 50 వేల ఇళ్ల నిర్మాణానికి ఉత్తర్వులు
MLA Kethireddy Venkatarami Reddy: మొన్నటివరకు సోషల్ మీడియాలో క్రేజ్.. ఇప్పుడు హైకమాండ్ క్లాస్..!