Nara Lokesh : ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న తరుణంలో పదవ తరగతి, ఇంటర్ పరీక్షలు నిర్వహించడం సరికాదంటూ టీడీపీ నేత నారా లోకేష్ సెటైరికల్ ట్వీట్లు చేశారు. వరుస ట్వీట్లలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ లపై విమర్శలు గుప్పించారు. వరుస ట్వీట్లో లోకేష్ ఏపీ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు. ” విద్యాశాఖా మంత్రి ఆదిమూలపు సురేష్ గారు! మీరు మొండిగా నిర్వహిస్తామంటున్న పరీక్ష పాసో, ఫెయిలో నిర్ణయించేది కాదు, 15 లక్షల మంది విద్యార్థులు, పరీక్ష నిర్వహించే 30 వేలమంది ఉపాధ్యాయులు, లక్షలాది కుటుంబసభ్యులందరితో కలిపి దాదాపు కోటి మంది ప్రాణాలకు ఇది విషమ పరీక్ష.” అందుకే మానవతా దృక్పథంతో ఆలోచించాలని ముఖ్యమంత్రి గారికి లేఖ రాశాను.
ఆ లేఖ రాసిన తరువాతే పరీక్షలు నిర్వహించి తీరుతామని ప్రకటించారు. అందుకే మూర్ఖపురెడ్డి అని సంబోధించాల్సి వచ్చింది. పంతాలు, పట్టింపులకు ఇది సమయం కాదు. నన్ను మీ నోటికొచ్చినట్టు మరో అరగంట తిట్టండి.. కానీ పరీక్షలు మాత్రం రద్దు చేసి విద్యార్థుల్ని కాపాడండి. నా విదేశీ చదువు, ఫీజుల గురించి మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు అన్ని వివరాలు పంపిస్తాను. మీరు బాగా చదువుకున్నవారే కాబట్టి అవి మీకు అర్థమై, మరోసారి తాడేపల్లి కాంపౌండ్ కాపీ పేస్ట్ స్క్రిప్ట్‌తో ఆరోపణలు చేయరని ఆశిస్తున్నాను. పరీక్షలు రద్దు చేసి మంచి మేనమామ అనిపించుకుంటాడో, పరీక్షలు పెట్టి కంసుడులాంటి మేనమామ అనిపించుకుంటాడో మీ మూర్ఖపు రెడ్డి ఇష్టం.” అంటూ లోకేష్ సీఎం జగన్ పై సెటైర్లు వేశారు.
విద్యాశాఖా మంత్రి @AudimulapSuresh గారు! మీరు మొండిగా నిర్వహిస్తామంటున్న పరీక్ష పాసో,ఫెయిలో నిర్ణయించేది కాదు,15 లక్షల మంది విద్యార్థులు,పరీక్ష నిర్వహించే 30 వేలమంది ఉపాధ్యాయులు,లక్షలాది కుటుంబసభ్యులందరితో కలిపి దాదాపు కోటి మంది ప్రాణాలకు ఇది విషమ పరీక్ష.(1/4)
— Lokesh Nara (@naralokesh) April 22, 2021
పంతాలు, పట్టింపులకు ఇది సమయం కాదు. నన్ను మీ నోటికొచ్చినట్టు మరో అరగంట తిట్టండి..కానీ పరీక్షలు మాత్రం రద్దు చేసి విద్యార్థుల్ని కాపాడండి. నా విదేశీ చదువు, ఫీజుల గురించి మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు అన్ని వివరాలు పంపిస్తాను.(3/4)
— Lokesh Nara (@naralokesh) April 22, 2021
మీరు బాగా చదువుకున్నవారే కాబట్టి అవి మీకు అర్థమై, మరోసారి తాడేపల్లి కాంపౌండ్ కాపీ పేస్ట్ స్క్రిప్ట్‌తో ఆరోపణలు చేయరని ఆశిస్తున్నాను. పరీక్షలు రద్దు చేసి మంచి మేనమామ అనిపించుకుంటాడో, పరీక్షలు పెట్టి కంసుడులాంటి మేనమామ అనిపించుకుంటాడో మీ మూర్ఖపు రెడ్డి ఇష్టం.(4/4)
— Lokesh Nara (@naralokesh) April 22, 2021
మరిన్ని ఇక్కడ చూడండి: Corona Vaccine: రూ. 400 కోట్లతో కోటి డోసుల టీకాలు కొనుగోలు చేస్తాం : కర్ణాటక ముఖ్యమంత్రి