నూతన్ నాయుడిని అందుకే అరెస్ట్ చేయలేదా…!

విశాఖ శిరోముండనం కేసులో నూతన్‌ నాయుడిని ఎందుకు అరెస్ట్ చేయలేదని టీడీపీ నేత, మాజీ మంత్రి ఆనంద బాబు ప్రశ్నించారు.

నూతన్ నాయుడిని అందుకే అరెస్ట్ చేయలేదా...!

Updated on: Aug 31, 2020 | 7:41 AM

Nakka Ananda Babu: విశాఖ శిరోముండనం కేసులో నూతన్‌ నాయుడిని ఎందుకు అరెస్ట్ చేయలేదని టీడీపీ నేత, మాజీ మంత్రి ఆనంద బాబు ప్రశ్నించారు. అతడు వైఎస్సార్‌సీపీ సిద్ధాంత కర్త కాబట్టే చర్యలు తీసుకోవడం లేదని ఆనంద బాబు విమర్శించారు. దళితులపై వరుస ఘటనలకు నిరసనగా టీడీపీ నేతలు గుంటూరులో దీక్షను చేపట్టారు. ఈ సందర్భంగా ఆనంద బాబు మాట్లాడుతూ.. వైసీపీ అధికారంలోకి రావడానికి కృషి చేసిన దళితులపైననే కక్షగట్టడం దారుణమని అన్నారు. వారి ఓట్లతో గెలిచి, వారిపైనే దాడులు చేయడం దారుణమని ఫైర్ అయ్యారు. బడుగులను హింసిస్తూ వైసీపీ నేతలు రాక్షసానందం పొందుతున్నారని ఆనంద బాబు విమర్శించారు. ఇక విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మెహన్ రావు మాట్లాడుతూ.. ఎస్సీల పట్ల అధికార వైసీపీ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు.

Read More:

ముందుగా ఆ ఉద్యోగులకు రిటైర్మెంట్ ఇవ్వండి: కేంద్రం

”టాలీవుడ్‌లో డ్రగ్స్ లేకుండా పార్టీలు జరగవు”..

Loading...
Unable to load recommendations.
Follow Us