‘మై వోట్ క్యూ’: ఈ యాప్‍తో అలవోకగా ఓటేసేయొచ్చు

| Edited By:

Mar 25, 2019 | 4:20 PM

పోలింగ్ బూత్‌లలో గంటల తరబడి వేచి ఉ‍ండాలంటే కష్టమే. దీంతో కొంతమంది ఓటేయడానికి బద్దకిస్తారు. దీనివల్ల పోలింగ్ శాతం బాగా తగ్గుతుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం సరికొత్త యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ‘మై ఓట్ క్యూ’ అనే యాప్ సాయంతో ఏ పోలింగ్ బూత్‌లో ఎంత రద్దీ ఉందో తెలుసుకోవచ్చు. రద్దీ తగ్గగానే అక్కడికి వెళ్లి వెంటనే ఓటు వేయచ్చు. శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరిపేందుకు ఇటీవల అన్ని పోలింగ్ బూత్‌ ప్రాంగణాల్లో సీసీటీవీ కెమేరాలను […]

మై వోట్ క్యూ’: ఈ యాప్‍తో అలవోకగా ఓటేసేయొచ్చు
Follow us on

పోలింగ్ బూత్‌లలో గంటల తరబడి వేచి ఉ‍ండాలంటే కష్టమే. దీంతో కొంతమంది ఓటేయడానికి బద్దకిస్తారు. దీనివల్ల పోలింగ్ శాతం బాగా తగ్గుతుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం సరికొత్త యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ‘మై ఓట్ క్యూ’ అనే యాప్ సాయంతో ఏ పోలింగ్ బూత్‌లో ఎంత రద్దీ ఉందో తెలుసుకోవచ్చు. రద్దీ తగ్గగానే అక్కడికి వెళ్లి వెంటనే ఓటు వేయచ్చు.

శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరిపేందుకు ఇటీవల అన్ని పోలింగ్ బూత్‌ ప్రాంగణాల్లో సీసీటీవీ కెమేరాలను ఏర్పాటు చేస్తున్నారు. వాటిలో రికార్డయ్యే దృశ్యాలను ‘మై ఓట్ క్యూ’ (MyVoteQ) యాప్‌కు అప్‌లోడ్ చేస్తారు. మీ పోలింగ్ బూత్‌ వివరాలను యాప్‌లో పొందుపరిస్తే వెంటనే ఆ వీడియో ప్రత్యక్షం అవుతుంది. వాటి ఆధారంగా క్యూ అంచనా వేసుకుని ఓటేయడానికి వెళ్లవచ్చు. దీని వల్ల గంటల తరబడి క్యూలో నిలుచోవలసిన అవసరం ఉండదు. ఈ ఏడాది జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో దీన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఈ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‍లోడ్ చేసుకోవచ్చు.