ఏపీ టీడీపీ సారథిగా యువ ఎంపీ..?

| Edited By:

Jun 20, 2019 | 1:09 PM

ఏపీలో పార్టీ పటిష్టతపై మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. గడిచిన ఎన్నికల్లో పార్టీ దారుణ ఓటమి తర్వాత నేతలు పార్టీ మారవచ్చునన్న సమాచారంతో అలెర్ట్ అయిన ఆయన ప్రక్షాళనపై దృష్టి పెట్టారని సమాచారం. ఇందులో భాగంగా యువ ఎంపీ అయిన కింజరపు రామ్మోహన్‌ నాయుడిని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించాలని బాబు నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. ఎప్పటినుంచో పార్టీకి వెన్నుదన్నుగా ఉంటూ వస్తోంది రామ్మోహన్ నాయుడు ఫ్యామిలి. అంతేకాకుండా టీడీపీలో కింజరపు […]

ఏపీ టీడీపీ సారథిగా యువ ఎంపీ..?
Follow us on

ఏపీలో పార్టీ పటిష్టతపై మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. గడిచిన ఎన్నికల్లో పార్టీ దారుణ ఓటమి తర్వాత నేతలు పార్టీ మారవచ్చునన్న సమాచారంతో అలెర్ట్ అయిన ఆయన ప్రక్షాళనపై దృష్టి పెట్టారని సమాచారం. ఇందులో భాగంగా యువ ఎంపీ అయిన కింజరపు రామ్మోహన్‌ నాయుడిని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించాలని బాబు నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. ఎప్పటినుంచో పార్టీకి వెన్నుదన్నుగా ఉంటూ వస్తోంది రామ్మోహన్ నాయుడు ఫ్యామిలి. అంతేకాకుండా టీడీపీలో కింజరపు ఫ్యామిలీకి ప్రత్యేక గుర్తింపు కూడా ఉంది. ఉత్తరాంధ్ర టీడీపీకి కంచుకోట ఎర్రనాయుడు అని పలుసార్లు చంద్రబాబు ప్రస్తావించిన విషయం విదితమే. ఈ పరిణామాల నేపథ్యంగానే రామ్మోహన్‌ నాయుడికి ఈ పదవి ఇస్తే బావుంటుందని బాబు ప్లాన్‌ అట.

కాగా.. ఇప్పటివరకూ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరించిన కళా వెంకట్రావ్ ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన సంగతి తెలిసిందే. చంద్రబాబు యూరప్ ట్రిప్ నుంచి తిరిగి నుంచి వచ్చాక.. రామ్మోహన్ నాయుడు నియామకంపై నిర్ణయం తీసుకోవచ్చునని తెలుస్తోంది.