హుజూర్‌నగర్‌ ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రి

హుజూర్‌ నగర్‌ ఉప ఎన్నికల ప్రచారం చివరి అంకానికి చేరింది. నేటి సాయంత్రం 5.00 గంటలకు ఎన్నికల ప్రచారం ముగుస్తుండటంతో.. అగ్రనేతలంతా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. బీజేపీ అభ్యర్థి డాక్టర్ రామారావు తరఫున ప్రచారం చేసేందుకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి హుజూర్‌నగర్‌లో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు మఠంపల్లి, మధ్యాహ్నం 12 గంటలకు వేపలి సింగారం, 12.30 గంటలకు మేళ్లచెర్వు, 1.30 గంటలకు చింతలపాలెంలో నిర్వహించే ప్రచార కార్యక్రమాల్లో కిషన్‌రెడ్డి […]

హుజూర్‌నగర్‌ ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రి

Edited By:

Updated on: Oct 19, 2019 | 8:21 AM

హుజూర్‌ నగర్‌ ఉప ఎన్నికల ప్రచారం చివరి అంకానికి చేరింది. నేటి సాయంత్రం 5.00 గంటలకు ఎన్నికల ప్రచారం ముగుస్తుండటంతో.. అగ్రనేతలంతా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. బీజేపీ అభ్యర్థి డాక్టర్ రామారావు తరఫున ప్రచారం చేసేందుకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి హుజూర్‌నగర్‌లో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు మఠంపల్లి, మధ్యాహ్నం 12 గంటలకు వేపలి సింగారం, 12.30 గంటలకు మేళ్లచెర్వు, 1.30 గంటలకు చింతలపాలెంలో నిర్వహించే ప్రచార కార్యక్రమాల్లో కిషన్‌రెడ్డి పాల్గొంటారని బీజేపీ వర్గాలు తెలిపాయి. హుజూర్‌నగర్‌లో పోటీ కాంగ్రెస్‌, టీఆర్ఎస్‌ల మధ్యే జరుగుతున్నా.. ఈ సారి బీజేపీ ఓటు బ్యాంకు పెంచుకునేందుకు ప్రచారంలో దూకుడుపెంచింది. గతంలో కంటే ఈ సారి ఎక్కువ ఓట్లు సాధించేందుకు ప్రయత్నాలు చేస్తోంది.