సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై సినీ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధినేత కమల్ హాసన్ స్పందించారు. ఎన్నికల్లో తమ పార్టీ బాగానే పనిచేసిందన్నారు. డబ్బు ప్రవాహంతోనే తమిళనాడులో ఫలితాలు తారుమారైనట్లు చెప్పారు. అయితే ప్రజాస్వామ్యంలో ఇలాంటి వాటిని ప్రోత్సహించకూడదన్నారు. తమ పార్టీ మొదట్లో ఓటింగ్ శాతం బాగానే ఉండి క్రమంగా తగ్గిందన్నారు. ఇంత తక్కువ సమయంలో తమ పార్టీని ప్రజలు బాగానే ఆదరించారని కమల్ హాసన్ తెలిపారు.