74 సీట్లు గెలుస్తాం: యోగి ఆదిత్యనాథ్

ఉత్తరప్రదేశ్‌లో 74కు పైగా లోక్‌సభ సీట్లను బీజేపీ గెలుచుకుంటుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ధీమా వ్యక్తం చేశారు. సమాజ్‌వాదీ, బహుజన్ సమాజ్ పార్టీ పొత్తును ఏమాత్రం పొంతనలేని కూటమిగా ఆయన అభివర్ణించారు. ‘బీజేపీ 2014 లోక్‍సభ ఎన్నికల్లో 73 సీట్లు గెలుచుకుంది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 325 సీట్లు వచ్చాయి. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లోనూ బీజేపీకి 74కు పైగా సీట్లు ఖాయం’ అని శనివారం మీడియాతో మాట్లాడుతూ యోగి అన్నారు. ఈడూజోడు ఏమాత్రం […]

74 సీట్లు గెలుస్తాం: యోగి ఆదిత్యనాథ్

Edited By:

Updated on: Mar 30, 2019 | 6:59 PM

ఉత్తరప్రదేశ్‌లో 74కు పైగా లోక్‌సభ సీట్లను బీజేపీ గెలుచుకుంటుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ధీమా వ్యక్తం చేశారు. సమాజ్‌వాదీ, బహుజన్ సమాజ్ పార్టీ పొత్తును ఏమాత్రం పొంతనలేని కూటమిగా ఆయన అభివర్ణించారు.

‘బీజేపీ 2014 లోక్‍సభ ఎన్నికల్లో 73 సీట్లు గెలుచుకుంది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 325 సీట్లు వచ్చాయి. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లోనూ బీజేపీకి 74కు పైగా సీట్లు ఖాయం’ అని శనివారం మీడియాతో మాట్లాడుతూ యోగి అన్నారు. ఈడూజోడు ఏమాత్రం కుదరని జోడిగా ఎస్పీ, బీఎస్‌పీ కూటమిని ఆయన అభివర్ణించారు. నీళ్లు, చమురు కలుస్తాయా అని ప్రశ్నించారు. సురక్షితమైన, అభ్యుదయ బాటలో పయనించే భారతదేశాన్ని ప్రజలు కోరుకుంటున్నారని, ఇందుకు కట్టుబడి ఉన్న మోదీని మరోసారి ప్రధానిగా చూడాలని ప్రజలు పట్టుదలతో ఉన్నారని యోగి తెలిపారు.