రైతులకు ప్రధాని నరేంద్రమోడీ గుడ్ న్యూస్‌..! ఆ పథకం కోసం మరిన్ని సబ్సిడీ నిధులు విడుదల..

|

Oct 13, 2021 | 7:01 AM

PM Narendra Modi: కేబినెట్ సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అన్నదాతల కోసం అదనంగా ఎరువుల సబ్సిడీని ప్రకటించారు

రైతులకు ప్రధాని నరేంద్రమోడీ గుడ్ న్యూస్‌..! ఆ పథకం కోసం మరిన్ని సబ్సిడీ నిధులు విడుదల..
Pm Modi
Follow us on

PM Narendra Modi: కేబినెట్ సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అన్నదాతల కోసం అదనంగా ఎరువుల సబ్సిడీని ప్రకటించారు. ఫాస్ఫాటిక్, పొటాసిక్ ఎరువుల కోసం రూ.28655 కోట్ల సబ్సిడీని కేటాయించారు. ఇది కాకుండా సైనిక్ స్కూల్ సొసైటీ పేరిట అప్లైడ్ సైనిక్ స్కూల్ తెరవడానికి కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నారు. ఇది ప్రస్తుత సైనిక్ స్కూల్‌కి కొంచెం భిన్నంగా ఉంటుంది. కేబినెట్ సమావేశంలో 2025-26 ఆర్థిక సంవత్సరం వరకు స్వచ్ఛ భారత్ మిషన్ (అర్బన్) ను కొనసాగించాలని నిర్ణయించారు.

స్వచ్ఛ భారత్ మిషన్ 2.0 కింద 1 లక్ష 41 వేల 600 కోట్ల నిధులు విడుదల చేశారు. ఇది మొదటి దశ కంటే 2.5 రెట్లు ఎక్కువ. స్వచ్ఛ భారత్ మిషన్ 2.0 కింద భారతదేశాన్ని పూర్తిగా బహిరంగ మల విసర్జన రహితంగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది.లక్ష కంటే తక్కువ జనాభా ఉన్న నగరాలు కూడా ఇందులో చేర్చారు. ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మరో నిర్ణయం కూడా తీసుకున్నారు. అమృత్ పథకం కింద మురుగునీటి నిర్వహణకు సంబంధించి తాజా ప్రణాళిక రూపొందించారు. స్వచ్ఛ భారత్ మిషన్ 2.0 కోసం 141600 కోట్లు ప్రకటించారు.

ఇందులో కేంద్రం సహకారం 36,465 కోట్లు. మొదటి దశ 2021-22 ఆర్థిక సంవత్సరం నుంచి 2025-26 ఆర్థిక సంవత్సరం వరకు ఉంటుంది. దీని కోసం ప్రభుత్వం 62,009 కోట్ల నిధులను ప్రకటించింది. స్వచ్ఛ భారత్ మిషన్ 2.0 కింద కేంద్రం, రాష్ట్రాల మధ్య భాగస్వామ్యం గురించి మాట్లాడితే.. నగరంలో 10 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్నట్లయితే ఈ భాగస్వామ్యం 25:75 నిష్పత్తిలో ఉంటుంది. 1-10 లక్షల లోపు నగరానికి 33:67, లక్ష కంటే తక్కువ జనాభా ఉన్న నగరాలకు 50:50 నిష్పత్తిలో ఈ భాగస్వామ్యం ఉంటుంది. అసెంబ్లీ సీటు లేని కేంద్రపాలిత ప్రాంతాలకు 100: 0 శాతం శాసనసభ సీటు ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలలో 80:20 నిష్పత్తిలో ఉంటుంది.

Horoscope Today: ఈ రాశివారికి ఈ రోజు శుభ ఫలితాలు.. దూర ప్రయాణాలు చేసే అవకాశం