భార్య ఉన్నా లేనట్టు నటించేవాడ్ని ఏమనాలి?: చంద్రబాబు

నరసరావుపేట: గుంటూరు జిల్లా నరసరావుపేట రోడ్‌ షోలో టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రధాని మోడీపై తీవ్ర విమర్శలు చేశారు. భార్య ఉన్నా లేనట్టు నటించేవాడ్ని ఏమనాలి? అంటూ మోడీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. తల్లిని చూడరు. భార్యను పట్టించుకోరు. పదవీ వ్యామోహం తప్ప మరో ధ్యాసలేదు అంటూ విరుచుకుపడ్డారు. ఎస్ఓఎన్ అంటూ విమర్శలు చేస్తున్నారని, తనకు భార్య, కొడుకు, కోడలు, ఓ మనవడు కూడా ఉన్నారని, మరి మోదీ […]

భార్య ఉన్నా లేనట్టు నటించేవాడ్ని ఏమనాలి?: చంద్రబాబు

Edited By:

Updated on: Apr 04, 2019 | 7:55 PM

నరసరావుపేట: గుంటూరు జిల్లా నరసరావుపేట రోడ్‌ షోలో టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రధాని మోడీపై తీవ్ర విమర్శలు చేశారు. భార్య ఉన్నా లేనట్టు నటించేవాడ్ని ఏమనాలి? అంటూ మోడీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. తల్లిని చూడరు. భార్యను పట్టించుకోరు. పదవీ వ్యామోహం తప్ప మరో ధ్యాసలేదు అంటూ విరుచుకుపడ్డారు. ఎస్ఓఎన్ అంటూ విమర్శలు చేస్తున్నారని, తనకు భార్య, కొడుకు, కోడలు, ఓ మనవడు కూడా ఉన్నారని, మరి మోదీ కథేంటి? అని చంద్రబాబు ప్రశ్నించారు.

తల్లిని చూసుకోవడం తెలియదు కానీ, చెన్నైలో ఉండే కరుణానిధిని ఢిల్లీ తీసుకెళ్లి తన ఇంట్లో పెట్టుకుంటాడట. అంతా రాజకీయాలు, నాటకాలు! అని విమర్శించారు. రాజధాని కట్టుకుంటామంటే నీళ్లు, మట్టి తెచ్చి మొహాన కొట్టి వెళ్లిపోయారు. నేను ఎంతోమంది రాజకీయ నాయకుల్ని చూశాను కానీ, మోదీ, కేసీఆర్, జగన్ లాంటి మనుషుల్ని ఎక్కడా చూడలేదు. ఇలాంటి సమయంలో రాష్ట్రం ఐక్యంగా ఉండాలి. లేదంటే భవిష్యత్తులో చాలా కష్టాలు వస్తాయి.