రెండు తెలుగు రాష్ట్రాల్లో మోగిన మరో ఎన్నికల నగారా.. షెడ్యూల్‌ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం

|

Feb 11, 2021 | 1:41 PM

తెలుగు రాష్ట్రాల్లో మరో ఎన్నికల నగారా మోగింది. ఏపీలో ఇప్పటికే పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. తెలంగాణలో నాగార్జున సాగర్..

రెండు తెలుగు రాష్ట్రాల్లో మోగిన మరో ఎన్నికల నగారా.. షెడ్యూల్‌ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం
Follow us on

తెలుగు రాష్ట్రాల్లో మరో ఎన్నికల నగారా మోగింది. ఏపీలో ఇప్పటికే పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. తెలంగాణలో నాగార్జున సాగర్ ఉపఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో ఏపీ, తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది.

ఈ ఎన్నికలకు ఫిబ్రవరి 16న నోటిఫికేషన్ విడుదలవుతుంది. ఫిబ్రవరి 23 వరకు నామినేషన్ల దాఖలుకు గడువు ఉంది. ఫిబ్రవరి 24న నామినేషన్లను పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు ఫిబ్రవరి 26 వరకు గడువు విధించారు. ఇక మార్చి 14న ఉదయం 8 నుంచి 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. మార్చి 17న ఫలితాలను ప్రకటిస్తారు.

ఏపీలో 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు, తెలంగాణలో రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. రెండు రాష్ట్రాల్లో అమల్లోకి ఎన్నికల కోడ్‌ రావడంతో ఉద్యోగలు పీఆర్సీ అంశం పెండింగ్‌లో పడనుంది.

 

Read more:

ఏపీ సీఎస్‌, డీజీపీతో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ భేటీ.. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై కీలక చర్చలు