Bhumana Karunakar Reddy: తిరుపతి వరదలకు చంద్రబాబే కారణం.. ప్రజలకు క్షమాపణ చెప్పాలని భూమన డిమాండ్..

|

Nov 23, 2021 | 1:27 PM

ఇప్పటి వరదలకు చంద్రబాబే కారణమన్నారు భూమన. తిరుపతి ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాతే తిరుపతిలో పర్యటించాలని డిమాండ్ చేశారు.

Bhumana Karunakar Reddy: తిరుపతి వరదలకు చంద్రబాబే కారణం.. ప్రజలకు క్షమాపణ చెప్పాలని భూమన డిమాండ్..
Bhumana Karunakar Reddy
Follow us on

తిరుపతిలో వరద సహాయక చర్యల్లో పాల్గొన్నారు ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి. తిరుపతిలోని ఎల్బీ నగర్ వీధిలో బురదను తొలగించారు. అధికారులను అప్రమత్తం చేస్తూ ముందుకు సాగుతున్నారు. తిరుపతి పర్యటనకు వస్తున్న చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి. ఇప్పటి వరదలకు చంద్రబాబే కారణమన్నారు భూమన. తిరుపతి ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాతే తిరుపతిలో పర్యటించాలని డిమాండ్ చేశారు.

చంద్రబాబు 1994లో ముఖ్యమంత్రి అయ్యే నాటికి తిరుపతిలో 43 చెరువులు కళకళలాడేవని అన్నారు. కానీ బాబు హయాంలో చాలా వరకు చెరువులు కబ్జాకు గురయ్యాయని.. తిరుపతిలో కబ్జాదారులను చంద్రబాబు ప్రోత్సహించారని ఆరోపించారు.

గతంలో తిత్లీ, హుదుహుద్ తుఫాన్లు వచ్చినప్పుడు నానా హడావుడి చేసి అధికారులను పని చేయనీకుండా చేశారని.. ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక్క ఆదేశంతోనే అధికారులు, క్యాడర్ పనిచేసినట్టు తెలిపారు ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి.

ఇవి కూడా చదవండి: YS Viveka Murder Case: వివేకా హత్య కేసు విచారణలో సంచలన నిజాలు.. సొంత అల్లుడిపైనే అనుమానాలు..

Winter Makeup Tips: కాలం మారింది.. మేకప్ కిట్‌లో ఈ నాలుగు మార్పులు చేసుకోండి..