రాజీనామా చేసిన మిజోరం గ‌వ‌ర్న‌ర్.. శశిథరూర్ పై ఎంపీగా పోటీ..?

| Edited By:

Mar 08, 2019 | 3:14 PM

న్యూఢిల్లీ : మిజోరం గ‌వ‌ర్న‌ర్ కుమ్మ‌నం రాజ‌శేఖ‌ర‌న్ త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. కేర‌ళ‌కు చెందిన బీజేపీ మాజీ చీఫ్ రాజ‌శేఖ‌ర‌న్ అక‌స్మాత్తుగా ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. అయితే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ నేత శ‌శిథ‌రూర్‌పై పోటీ చేసేందుకే రాజ‌శేఖ‌ర‌న్ గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌వికి రాజీనామా చేసిన‌ట్లు అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు. గత ఏడాది మే నెల‌లో మిజోరం గ‌వ‌ర్న‌ర్‌గా రాజ‌శేఖ‌ర‌న్ బాధ్య‌త‌లు స్వీక‌రించారు. కేవ‌లం ప‌ది నెల‌లు మాత్ర‌మే ఆయ‌న ఆ ప‌ద‌విలో ఉన్నారు. కాగా […]

రాజీనామా చేసిన మిజోరం గ‌వ‌ర్న‌ర్.. శశిథరూర్ పై ఎంపీగా పోటీ..?
Follow us on

న్యూఢిల్లీ : మిజోరం గ‌వ‌ర్న‌ర్ కుమ్మ‌నం రాజ‌శేఖ‌ర‌న్ త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. కేర‌ళ‌కు చెందిన బీజేపీ మాజీ చీఫ్ రాజ‌శేఖ‌ర‌న్ అక‌స్మాత్తుగా ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. అయితే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ నేత శ‌శిథ‌రూర్‌పై పోటీ చేసేందుకే రాజ‌శేఖ‌ర‌న్ గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌వికి రాజీనామా చేసిన‌ట్లు అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు. గత ఏడాది మే నెల‌లో మిజోరం గ‌వ‌ర్న‌ర్‌గా రాజ‌శేఖ‌ర‌న్ బాధ్య‌త‌లు స్వీక‌రించారు. కేవ‌లం ప‌ది నెల‌లు మాత్ర‌మే ఆయ‌న ఆ ప‌ద‌విలో ఉన్నారు. కాగా తన రాజీనామా పత్రాన్ని రాష్ట్రపతికి అందజేయడంతో.. వెంటనే రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ .. రాజ‌శేఖ‌ర‌న్ రాజీనామాను ఆమోదించారు. ప్రస్తుతం అస్సాం గ‌వ‌ర్న‌ర్ జ‌గ‌దీశ్ ముఖీ.. మిజోరం గవర్నర్‌గా అద‌న‌పు బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించ‌నున్నారు.

2014 ఎన్నికల్లో తిరువనంతపురం ఎంపీ సీటును బీజేపీ కేవలం 15వేల 470సీట్ల తేడాతో కొల్పోయింది. దీంతో ఈసారి అక్కడ బీజేపీ నేత, అయ్యప్ప భక్తుడైన రాజశేఖరన్‌ను రంగంలోకి దించి ఎంపీ సీటును కైవసం చేసుకునేందుకు కమలదళం పావులుకదుపుతోంది. రాజశేఖరన్ 1970లో ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. 1987లో రాజశేఖరన్ ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తిస్థాయిగా సంఘ్ పరివార్ కార్యకర్తగా పనిచేయడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే ఆయన హిందూ ఐక్యవేదిక, శబరిమల అయ్యప్ప సేవా సమాజం సెక్రటరీగా బాధ్యతలు చేపట్టారు.