
Minister Shankar Narayana: ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విషయంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు మంత్రి శంకర్ నారాయణ. ఎస్‌ఈసీ రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారని ఆగ్రహించారు. పూర్తిగా చంద్రబాబు డైరెక్షన్లో పనిచేస్తూ మంత్రులను బెదిరించే స్థాయికి వచ్చారని ఆరోపించారు. రాష్ట్రపతి మంత్రి పెద్దిరెడ్డి సొంత నియోజకవర్గానికి వచ్చినా కలిసేందుకు వీలు లేదని చెప్పడం ఏమిటని ప్రశ్నించారు.
ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధులు విషయంలో ఆయన దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఆయనకు ప్రజాస్వామ్య రీతిలోనే తగిన బుద్ధి చెబుతామని అన్నారు. కాగా పంచాయతీ ఎన్నికల్లో గీత దాటిన పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఇంటికే పరిమితం చేయాలని, ఆయన మీడియాతో మాట్లాడేందుకు వీల్లేకుండా చేయాలని, గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిసే ఈ నెల 21 వరకూ దీనిని అమలు చేయాలని ఆదేశిస్తూ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ రాష్ట్ర డీజీపీకి లేఖ రాసిన సంగతి తెలిసిందే.