Minister Perni Nani Comments: జనసేన ఆవిర్భావ సభలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి పేర్ని నాని కౌంటరిచ్చారు. నమస్కారాలతో పవన్ వింత సంస్కారం చూపించారని కానీ అన్న చిరంజీవికి మాత్రం నమస్కారం ఎందుకు పెట్టలేదన్నారు. జీవితాన్ని తీర్చిదిదిన చిరంజీవికే గౌరవం ఇవ్వలేదు, ఆయన లేకుంటే పవన్ కళ్యాణ్ ఎక్కడుండేవాడని ప్రశ్నించారు.. టీడీపీ బాగుండాలనేదే పవన్ ఆకాంక్ష అని జగన్ అధికారంలోకి రాకూడదనేదే పవన్, చంద్రబాబుల లక్ష్యమన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చాలనే ఉద్దేశం చంద్రబాబు పాలనలో మీకు ఎందుకు లేదు.. 2014 నుంచి 2019 వరకు పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు. రాజధాని గ్రామాల్లో రైతులకు వైసీపీ మాత్రమే అండగా నిలిచిందని, బీజేపీ, టీడీపీలను కలిపేందుకే పవన్ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. రాజధాని విషయంలో పవన్ మొదట కర్నూల్ అన్నారని, ఇప్పుడు పూటకో మాట మారుస్తాన్నారంటు ఎద్దేవా చేశారు. సిద్ధాంతాలపై ఎన్నో పుస్తకాలు చదివిన పవన్ ఇలా మాట్లాడటం సరికాదని.. అవినీతికి అవకాశం లేకుండా సంక్షేమ పథకాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
పవన్ కల్యాణ్‌ను నడిపించే శక్తి బీజేపీయేనని, విశాఖ రైల్వేజోన్, కడప ఉక్కు ఫ్యాక్టరీ గురించి ఎప్పుడైనా కేంద్రాన్ని నిలదీసారా అంటూ విమర్శించారు. గదుల్లో ఒకమాట గల్లీల్లో ఒక మాట అంటూ ఆగ్రహించారు. రాజకీయాలు వేరని సినిమాలు వేరని కంఠం పవన్‌ది భావం చంద్రబాబుదని ఆరోపించారు. ప్రత్యేక హోదా ఇవ్వని బీజేపీని పవన్ ఒక్క మాట కూడా అనలేదని వైసీపీ నేతలకు తొడలు కొట్టే అలవాటు లేదని చెప్పారు. బాబుని మళ్లీ అధికారంలోకి తీసుకురావడానికే పవన్ కళ్యాణ్ తిప్పలు పడుతున్నాడని, పవన్ కల్యాణ్ రాజకీయ ఊసరవెల్లి అని వైసీపీకి కమ్మవారిని ఎందుకు దూరం చేయాలని చూస్తున్నారని మంత్రి పేర్నినాని ప్రశ్నించారు. ఎంతమంది ఎదురొచ్చినా జగన్ ఒంటరిగానే పోరాటం చేస్తారని ప్రతీ ఎన్నికల్లో పవన్ ఏ గుర్తుకు ఓటు వేయమంటాడో తెలియక జనసైనికుల్లో గందరగోళం ఉందన్నారు. ఆ పార్టీ, ఈ పార్టీ అంటూ జంపింగ్ జపాంగ్‌లా పవన్ దూకుతున్నారని ఎద్దేవా చేశారు.