మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల టీఆర్‌ఎస్ అభ్యర్థి ఎస్.వాణి దేవి కి మద్దతుగా హోటల్ టూరిజం ప్లాజాలో నిర్వహించిన సమావేశంలో మంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి హరీశ్‌రావుతో పాటు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయిన్ పల్లి వినోద్ కుమార్ హాజరయ్యారు. ఎన్నికలు, ఓట్లు ఎప్పుడూ ఉంటాయి. ప్రజాస్వామ్యం లో ఎందుకు ఓటు వేస్తున్నామని ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని పట్టభద్రులను ఉద్దేశించి హరీశ్ రావు అన్నారు.
డా.బి.ఆర్.అంబెడ్కర్ రచించిన రాజ్యాంగం వల్ల మనందరం ఇక్కడ ఉన్నాం. కానీ ఈరోజు డా.బి.ఆర్ అంబెడ్కర్ రచించిన రాజ్యాంగాన్ని సవరించే కుట్ర జరుగుతున్నదని మంత్రి హరీశ్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు. ఆ హక్కులు కాల రాసె ప్రయత్నం జరుగుతుంది అదే జరిగితే వందేళ్లు వెనక్కి పోతామని హెచ్చరించారు. ప్రభుత్వ రంగ సంస్థలు ప్రయివేట్ పరం చేస్తున్నారు. భుత్వ రంగ సంస్థలు తొలగించేందుకు ఓ మంత్రిత్వ శాఖ పెట్టారు. ప్రభుత్వ రంగ సంస్థలు ఏర్పాటుకు మంత్రిత్వ శాఖ అవసరం కానీ వాటిని తొలగించే శాఖను ఏర్పాటు చేసిన ఘనత బిజెపికి దక్కుతుందని ఎద్దేవా చేశారు.
ఎల్ ఐ సి , కేంద్ర ప్రభుత్వ సంస్థలు ప్రయివేట్ పరం అయితే మన హక్కులు, రిజర్వేషన్లు ఉండవు.. ఎస్సి ఎస్టీ లకు అన్యాయం జరుగుతుంది ఇది అందరూ ఆలోచించాలని మంత్రి హరీశ్‌రావు అన్నారు. వారసత్వ సంపదగా ఎన్నో కంపెనీలు ఉన్నాయి. కానీ వాటిని బీజేపీ ప్రభుత్వం అమ్మేస్తోంది. రిజర్వేషన్లు ఎత్తేసే కుట్ర జరుగుతున్నది. అంబెడ్కర్ స్ఫూర్తిని దెబ్బతిస్తున్నారు. మీరంతా ఒక్కసారి ఆలోచించాలని పట్టభద్రులను హెచ్చరించారు.
తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో నీటిపారుదల శాఖలో జీవో నంబర్ 59 తెచ్చాను. అన్ని వర్కింగ్ ఏజెన్సీ లో జనాభా ప్రాతిపదికన వర్క్ లు కేటాయించాలని తెచ్చాము. ఈ జీవో తెచ్చిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. సింగరేణి లో అమలు జరగడంలేదు అని పిర్యాదు వస్తే ఎస్సి ఎస్టీ కమిషన్ వెళ్లి 21 శాతం వర్క్ ఇచ్చేలా అమలు చేసిన ఘనత మన టీఆర్‌ఎస్ ప్రభుత్వానిది. స్వయం ఉపాధి పథకాలు ఎన్నో తెచ్చాము. డిక్కీని బలోపీతము చేశాం. ప్రభుత్వం నుండి ఇన్పుట్ సబ్సిడీ పవర్ సబ్సిడీ ఇచ్చాం. అంబెడ్కర్ విగ్రహము 125 అడుగులు 146 కొట్లతో హైదరాబాద్ నడిబొడ్డున ఏర్పాటు చేసుకుంటున్నాం. అందుకోసం యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయని మంత్రి హరీశ్‌రావు చెప్పారు.
ఎస్సి ఎస్టీ ఆత్మగౌరవ భవనాలు, దళిత స్టడీ సర్కిల్ బుద్ధవనం త్వరలోనే ప్రారంభించుకుంటాం. ఎస్సి ఎస్టీ అమ్మయిలు చదువుకోవాలంటే చాలా ఇబ్బంది ఉండే. టీఆరెస్ ప్రభుత్వం వచ్చాక 30 ఎస్టీ మహిళా రెసిడెన్షియల్ ,14 ఎస్సి డిగ్రీ రెసిడెన్షియల్ కాలేజీలు ఏర్పాటు చేశాం. 268 గురుకులాలు ఏర్పాటు చేశాం. గతంలో 10వ తరగతి వరకు ఉండే దాని ఇంటర్ వరకు చేశాం. ఎస్సి రెసిడెన్షియల్ స్కూల్స్ లో లక్షా 46 వేల విద్యార్థులు చదువుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యకు అంత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. ఎస్సి ఎస్టీ లకు విదేశాల్లో చదివేందుకు ఓవర్సీస్ పథకం తెచి, రూ.20 లక్షలు అందిస్తున్నాం. దేశంలో ఇలాంటి పథకం ఎక్కడా లేదన్నారు హరీశ్‌రావు.
కేంద్ర ప్రభుత్వం విధానాల పై మీరంతా ఆలోచించాలి. అంబెడ్కర్ చెప్పినట్టు సమికరించు, బోధించు, పోరాడు అన్న సిద్ధాంతం మేరకు పనిచేయాలి. బిజెపి రెచ్చగొట్టే ప్రకటనలకు మోసపోవద్దు. మాయమాటలు నమ్మద్దు..గాయి గత్తర చేసే ప్రయత్నం చేస్తారు. ఎస్సి ఎస్టీ లకు రిజర్వేషన్లు తెచ్చిన ప్రభుత్వం టీఆరెస్ ప్రభుత్వం. మార్కెట్ కమిటీల్లో ఈరోజు తెలంగాణ లో మహిళలు చైర్మన్లు అయ్యారు. పివి వాణి దేవి నిగర్వి. లక్ష మంది గ్రాడ్యుయేట్ లను తయారు చేశారు. పోటీలో ఉన్న 93 మందిలో ఒకే ఒక్క మహిళ ఉంది. మహిళలు అందరూ వాణి దేవికి ఓటు వేయాలి. చట్ట సభ కు పంపించాలని హరీశ్‌రావు విజ్ఞప్తి చేశారు.
Read More: