
చంద్రబాబు, జగన్‌లపై ఏపీ ప్రజలకు నమ్మకం లేదని.. ఏపీ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అన్నారు మాయావతి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా విషయంలో.. కాంగ్రెస్, బీజేపీ ఏపీ రాష్ట్ర ప్రజలను వంచించాయన్నారు. కాంగ్రెస్, బీజేపీపై ఏపీ ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. హామీలు అమలు చేయకుండా ప్రజలను మోడీ మభ్యపెడుతున్నారు. ఏపీ ప్రజలు చంద్రబాబు, జగన్ వలలో పడొద్దని ఆమె పేర్కొన్నారు. జనసేన, బీఎస్పీ, సీపీఐ, సీపీఎం కూటామికి మద్దతివ్వమని ఆమె అన్నారు. మా కూటమి అధికారంలోకి వస్తే పవన్‌ను సీఎంని చేస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ విడిపోయాక ఏపీ ప్రజలకు న్యాయం జరగలేదని.. హామీలు నెరవేర్చనందుకే కాంగ్రెస్ అధికారం కోల్పోయిందని ఆమె ఎద్దేవా చేశారు. మేం కేంద్రంలో ఎవరితోనూ కలిసేది లేదని తెలిపారు మాయవతి.