మమతా బెనర్జీపై దాడి, కాలికి గాయం అంతా బూటకం, బీజేపీ నేత శిశిర్ అధికారి ఆరోపణ

| Edited By: Phani CH

Mar 24, 2021 | 8:19 PM

బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై దాడి, ఆమె కాలికి గాయం  అంతా వట్టి బూటకమని ఇటీవలే తృణమూల్ నుంచి బీజేపీలో చేరిన శిశిర్ అధికారి ఆరోపించారు.

మమతా బెనర్జీపై దాడి, కాలికి గాయం అంతా బూటకం, బీజేపీ నేత శిశిర్ అధికారి ఆరోపణ
Sisir Adhikari
Follow us on

బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై దాడి, ఆమె కాలికి గాయం  అంతా వట్టి బూటకమని ఇటీవలే తృణమూల్ నుంచి బీజేపీలో చేరిన శిశిర్ అధికారి ఆరోపించారు.తనపై దాడి జరిగిందన్న ఆమె వ్యాఖ్యలను అపహాస్యం చేశారు. అసలు ఇందుకు ఆధారాలు ఏవైనా ఉన్నాయా అని ప్రశ్నించారు. ఆమెను ఎక్స్-రే రిపోర్టు అడగండి.. తన మెడికల్ రికార్డులు చూపమనండి  అన్నారు. నందిగ్రామ్ లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఉండగా మమతా బెనర్జీ 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోల్ కతా లోని ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరం ఏమిటన్నారు. పైగా కేవలం 2 కి.మీ. దూరంలో ఉన్న రాయపడలో కూడా ఓ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కూడా ఉందన్నారు. ఆమె వీల్ చైర్ లోనే తిరుగుతారని, ఇంకా సరిగా కూర్చోజాలరని, జంప్  వుతారని తెలిసి ఆమెను  వీల్ చైర్ కి కట్టేశారని శిశిర్ అధికారి వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

లోగడ తృణమూల్ నుంచి బీజేపీ లో చేరిన సువెందు అధికారి తండ్రే ఈయన.. ఇటీవలే హోమ్ మంత్రి అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరారు.   లోగడ ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఈయన ఆ తరువాత సుమారు 23 ఏళ్ళు తృణమూల్  కాంగ్రెస్ లో కొనసాగారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ హయాంలో  కేంద్ర మంత్రిగా కూడా వ్యవహరించారు. కాగా మొదట సువెందు అధికారి, ఆ తరువాత అయన సోదరుడు కూడా బీజేపీలో చేరిన సంగతి విదితమే.. తాజాగా వీరి తండ్రి శిశిర్ అధికారి కూడా ఈ పార్టీలో చేరడంతో వీరి కుటుంబమంతా కమలం పార్టీలో చేరినట్లయింది. అటు. అధికారి కుటుంబాన్ని సీఎం మమతా బెనర్జీ తన ఎన్నికల ప్రచారంసందర్భంగా తీవ్రంగా తప్పు పట్టారు. ఈ కుటుంబానికి రూ. 5 వేలకోట్ల ప్యాలస్ ఉన్నట్టు తాను విన్నానని, మళ్ళీ అధికారంలోకి  వస్తే దీనిపై దర్యాప్తు జరిపిస్తానని ఆమె అన్నారు.

 

మరిన్ని ఇక్కడ చదవండి: దౌర్భాగ్యం.. అన్నం పెట్టే రైతన్నలపైనా మీ ప్రతాపం.. కోట్లు కొల్లగొట్టి పారిపోతే మాత్రం నో యాక్షన్

చెప్పండీ.. తమిళ తంబీలు.. వాట్‌ టు డూ.. వాట్‌ నాట్‌ టు డూ.. అంటూ నేతల బంపర్‌ ఆఫర్లు..