సారీ మోదీజీ.. మీ పార్టీ వల్లే ప్రమాణ స్వీకారోత్సవం మిస్ అవుతున్నా

ఎన్డీయే తరఫున రెండోసారి ప్రధానిగా ఎన్నికైన నరేంద్ర మోదీ.. గురువారం ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆయన ఆహ్వానం పంపారు. ఆ లిస్ట్‌లో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఉన్నారు. అయితే ఈ ఆహ్వానంపై తాజాగా స్పందించిన దీదీ.. మోదీకి సారీ చెబుతూ తాను ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాలేనని స్పష్టం చేస్తూ ఓ లేఖను విడుదల చేశారు. ‘‘ప్రధానమంత్రి నరేంద్రమోదీకి కంగ్రాట్స్. మీరు పంపిన ఆహ్వానాన్ని […]

సారీ మోదీజీ.. మీ పార్టీ వల్లే ప్రమాణ స్వీకారోత్సవం మిస్ అవుతున్నా
Mamata Banerjee To PM Narendra Modi

Edited By:

Updated on: May 29, 2019 | 6:33 PM

ఎన్డీయే తరఫున రెండోసారి ప్రధానిగా ఎన్నికైన నరేంద్ర మోదీ.. గురువారం ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆయన ఆహ్వానం పంపారు. ఆ లిస్ట్‌లో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఉన్నారు. అయితే ఈ ఆహ్వానంపై తాజాగా స్పందించిన దీదీ.. మోదీకి సారీ చెబుతూ తాను ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాలేనని స్పష్టం చేస్తూ ఓ లేఖను విడుదల చేశారు.

‘‘ప్రధానమంత్రి నరేంద్రమోదీకి కంగ్రాట్స్. మీరు పంపిన ఆహ్వానాన్ని మన్నించి మీ ప్రమాణస్వీకారానికి రావాలని భావించా. కానీ గంట క్రితం ప్రతి మీడియాలో మీ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోంది. పశ్చిమబెంగాల్‌లో హింస వలన 54మంది బీజేపీ కార్యకర్తలు మరణించారని మీ పార్టీ ఆరోపణలు చేస్తోంది. అదంతా అబద్ధం. పశ్చిమ బెంగాల్‌లో రాజకీయ హత్యలు లేవు. వారి వ్యక్తిగత బాధలతోనో, కుటుంబ సమస్యలతోనో.. మరే కారణంతోనో వారు మరణించి ఉండొచ్చు. కానీ వాటికి రాజకీయాలను ముడిపెట్టొద్దు. ఈ విషయం నన్ను బాధించింది. అందుకే మీ ప్రమాణ స్వీకారానికి రాలేకపోతున్నా. ప్రజాస్వామ్యంలో ప్రమాణ స్వీకారమన్నది ఒక ప్రత్యేకమైన సందర్భం. ఏ రాజకీయ పార్టీ కూడా దాని స్థాయిని దిగజార్చజాలదు. దయచేసి మన్నించండి’’ అంటూ మమతా లేఖలో పేర్కొన్నారు.