మూడో దశ ఎన్నికలకు సర్వం సిద్ధం..

| Edited By:

Apr 22, 2019 | 10:10 AM

దేశ వ్యాప్తంగా రేపు మూడోదశ పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొత్తం 14 రాష్ట్రాల్లోని 115 లోక్‌సభ నియోజక వర్గాల్లో రేపు పోలింగ్ జరగనుంది. దక్షిణాది రాష్ట్రాల్లోని 34 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. తమిళనాడులోని వేలూరు నియోజకవర్గం మినహా.. దక్షిణాదిలోని అన్ని రాష్ట్రాల్లో మూడో దశ పోలింగ్‌తో ఎన్నికల ప్రక్రియకు తెరపడినట్టే. మొత్తం 543 లోక్‌సభ స్థానాలకు ఏడు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఈ నెల 11, 18 తేదీల్లో జరిగిన రెండు దశల పోలింగ్‌లో […]

మూడో దశ ఎన్నికలకు సర్వం సిద్ధం..
Follow us on

దేశ వ్యాప్తంగా రేపు మూడోదశ పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొత్తం 14 రాష్ట్రాల్లోని 115 లోక్‌సభ నియోజక వర్గాల్లో రేపు పోలింగ్ జరగనుంది. దక్షిణాది రాష్ట్రాల్లోని 34 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. తమిళనాడులోని వేలూరు నియోజకవర్గం మినహా.. దక్షిణాదిలోని అన్ని రాష్ట్రాల్లో మూడో దశ పోలింగ్‌తో ఎన్నికల ప్రక్రియకు తెరపడినట్టే.

మొత్తం 543 లోక్‌సభ స్థానాలకు ఏడు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఈ నెల 11, 18 తేదీల్లో జరిగిన రెండు దశల పోలింగ్‌లో 186 నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహించారు. రేపు మూడోదశలో 115 నియోజకవర్గాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. గుజరాత్‌లోని 26, కర్నాటకలోని 14, మహారాష్ట్రలో 13, కేరళలో 20, ఉత్తరప్రదేశ్‌లో 10, అసోంలో 4, ఛత్తీస్‌గడ్‌లో 7, బీహార్‌లో 5, ఒడిశాలో 6, పశ్చిమ బెంగాల్‌లో 5, జమ్మూ కాశ్మీర్, దాదార్ హవేలీ, డయ్యూడామన్, త్రిపురలో ఒక్కొక్క నియోజకవర్గానికి ఎన్నికలు నిర్వహిస్తున్నారు.