రాయపాటి ఒక్కసారి కూడా నియోజకవర్గంలో పర్యటించలేదు: లావు కృష్ణ

ఈసారి ఎన్నికల్లో వైసీపీ గెలుపు ఖాయమని అన్నారు లావు కృష్ణ దేవరాయలు. కష్టపడే వ్యక్తికి.. కనపడని వ్యక్తికి మధ్య జరిగే ఎన్నికల పోరులో తనదే విజయమని అన్నారు వైసీపీ నేత లావు కృష్ణ. నర్సరావుపేట నియోజకవర్గంలో ఇప్పటికే మూడు వందలకు పైగా గ్రామాల్లో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్నానన్నారు. నియోజకవర్గానికి ప్రత్యేక మేనిఫెస్టో రూపొందించామన్నారు లావు కృష్ణ. రాయపాటి ఈ అయిదేళ్లలో ఒక్కసారి కూడా నియోజకవర్గానికి రాలేదన్నారు. వైసీపీకి పల్నాడులో అనూహ్య స్పందన వస్తోందంటున్నారు లావు కృష్ణ […]

రాయపాటి ఒక్కసారి కూడా నియోజకవర్గంలో పర్యటించలేదు: లావు కృష్ణ

Edited By:

Updated on: Apr 04, 2019 | 5:32 PM

ఈసారి ఎన్నికల్లో వైసీపీ గెలుపు ఖాయమని అన్నారు లావు కృష్ణ దేవరాయలు. కష్టపడే వ్యక్తికి.. కనపడని వ్యక్తికి మధ్య జరిగే ఎన్నికల పోరులో తనదే విజయమని అన్నారు వైసీపీ నేత లావు కృష్ణ. నర్సరావుపేట నియోజకవర్గంలో ఇప్పటికే మూడు వందలకు పైగా గ్రామాల్లో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్నానన్నారు. నియోజకవర్గానికి ప్రత్యేక మేనిఫెస్టో రూపొందించామన్నారు లావు కృష్ణ. రాయపాటి ఈ అయిదేళ్లలో ఒక్కసారి కూడా నియోజకవర్గానికి రాలేదన్నారు. వైసీపీకి పల్నాడులో అనూహ్య స్పందన వస్తోందంటున్నారు లావు కృష్ణ దేవరాయలు.