Telangana Politics: ఒక్క ఫోన్ కాల్ కాస్తా హుజురాబాద్‌తో పాటు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను కుదిపేసింది. మూడు పార్టీలను ఉలిక్కి పడేలా చేసింది. తనకు టీఆర్‌ఎస్ టికెట్ కన్‌ఫర్మ్ అయిపోయిందంటూ కాంగ్రెస్ నాయకుడు కౌశిక్ రెడ్డి ఫోన్‌లో మాట్లాడిన మాటలు సంచలనం సృష్టించాయి. ఇటీవలే టీఆర్‌ఎస్ నుంచి బీజేపీలో చేరిన విజేందర్‌తో కౌశిక్ మాటలు బయటకు వచ్చాయి.. వ్యవహారంతో ఆగ్రహించిన కాంగ్రెస్ పార్టీకి ఆయనకు నోటీసు ఇవ్వడంతో పార్టీ నుంచి బహిష్కరించింది.
మీరు నన్ను సస్పెండ్ చేయడం ఏమిటి నేనే రాజీనామా చేస్తున్నానంటూ ప్రకటించిన కౌశిక్.. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మానికం ఠాగూర్‌ల మీద తీవ్ర ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డి 50 కోట్ల రూపాయలు ఇచ్చి పీసీపీ చీఫ్ అయ్యారంటూ విరుచుకుపడ్డారు. 2019 ఎన్నికల్లో హుజూరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన కౌశిక్.. టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు ప్రకటించినా.. ఫోన్ కాల్ వ్యవహారంతో ఆయనకు ఆ పార్టీ టికెట్ వస్తుందా రాదా అనేది అనుమానమే.
కౌశిక్ వ్యవహారం బయట పడేసరికి ఇంకా ఇంటి దొంగలు ఎవరెవరున్నారనే విషయమై కాంగ్రెస్ ఆరా తీస్తోంది. పీసీసీ చీఫ్ రేవంత్ ఈ విషయంలో గట్టి వార్నింగ్ ఇచ్చారు. కౌశిక్ కోవర్ట్ అంటూ కాంగ్రెస్ నాయకులు విరుచుకుపడ్డారు. మరోవైపు ఆత్మరక్షణలో పడిని టీఆర్‌ఎస్ ప్రతిపక్షానికి గట్టి కౌంటరే ఇస్తోంది.
అయితే, కౌశిక్ గులాబీ కండువా కప్పుకుంటే ఈటల గెలుపు నల్లేరుమీద నడకేనని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరికొందరు మాత్రం అంత సీన్ లేదని కొట్టిపడేస్తున్నారు. మరోవైపు ఆడియో వైరల్ కావడంతో హుజూరాబాద్‌లో కొత్త చర్చ రచ్చ చేస్తోంది. ఈటలను టీఆర్ఎస్ అన్ని రకాలుగా టార్గెట్ చేసిందనే వార్తలు వినిపిస్తున్నాయి.
Read also: IMD alert: తెలుగు రాష్ట్రాల్లో దంచి కొడుతోన్న వర్షాలు.. రెండు రోజుల పాటు ఇదే పరిస్థితి