విజయసాయిరెడ్డిపై కొండ్రు మురళి తీవ్ర వ్యాఖ్యలు

వైసీపీ నేత విజయసాయిరెడ్డిపై మాజీ మంత్రి కొండ్రు మురళి తీవ్ర స్ధాయిలో విరుచుకుపడ్దారు. ఆర్ధిక నేరస్ధుడైన విజయసాయిరెడ్డి తనపై ఈసీకి ఫిర్యాధు చేయటం దురదృష్టకరమని ఆయన అన్నారు. ఎన్నికల కమిషన్‌ను తప్పుదోవ పట్టించిన విజయసాయిపై క్రిమినల్ కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. జగన్ కేసుల్లో ఇరుక్కోవటానికి విజయసాయే కారణమని కొండ్రు మురళి ఆరోపించారు. ప్రతిపక్ష నేత జగన్ అధికారంలోకి వస్తే వీధిరౌడీలు ఎక్కువవుతారని అన్నారు. తన స్నేహితుడి కారులో పోస్టర్లు లభ్యమైతే కోట్లు దొరికాయని వైసీపీ దుష్ప్రచారం […]

విజయసాయిరెడ్డిపై కొండ్రు మురళి తీవ్ర వ్యాఖ్యలు

Edited By:

Updated on: Mar 29, 2019 | 8:44 PM

వైసీపీ నేత విజయసాయిరెడ్డిపై మాజీ మంత్రి కొండ్రు మురళి తీవ్ర స్ధాయిలో విరుచుకుపడ్దారు. ఆర్ధిక నేరస్ధుడైన విజయసాయిరెడ్డి తనపై ఈసీకి ఫిర్యాధు చేయటం దురదృష్టకరమని ఆయన అన్నారు. ఎన్నికల కమిషన్‌ను తప్పుదోవ పట్టించిన విజయసాయిపై క్రిమినల్ కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. జగన్ కేసుల్లో ఇరుక్కోవటానికి విజయసాయే కారణమని కొండ్రు మురళి ఆరోపించారు. ప్రతిపక్ష నేత జగన్ అధికారంలోకి వస్తే వీధిరౌడీలు ఎక్కువవుతారని అన్నారు. తన స్నేహితుడి కారులో పోస్టర్లు లభ్యమైతే కోట్లు దొరికాయని వైసీపీ దుష్ప్రచారం చేసిందని కొండ్రు మురళి మండిపడ్డారు.