కోదండరాంతో కొండా విశ్వేశ్వర్ రెడ్డి భేటీ

టీఆర్‍ఎస్ అమలుకు నోచుకోని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిందని చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన తెలంగాణ జన సమితి అధినేత కోదండరాంను కలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘‘డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టడం ఈ బడ్జెట్‌తో అసాధ్యం. ప్రజలను హామీల ముసుగులో మరోసారి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆరుగురు కుటుంబ సభ్యులు ఒక రాష్ట్రాన్ని శాసించడం నేను ఎక్కడా చూడలేదు. రాజకీయ జ్ఞానం నాకు […]

కోదండరాంతో కొండా విశ్వేశ్వర్ రెడ్డి భేటీ

Updated on: Apr 02, 2019 | 5:00 PM

టీఆర్‍ఎస్ అమలుకు నోచుకోని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిందని చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన తెలంగాణ జన సమితి అధినేత కోదండరాంను కలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘‘డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టడం ఈ బడ్జెట్‌తో అసాధ్యం. ప్రజలను హామీల ముసుగులో మరోసారి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆరుగురు కుటుంబ సభ్యులు ఒక రాష్ట్రాన్ని శాసించడం నేను ఎక్కడా చూడలేదు. రాజకీయ జ్ఞానం నాకు లేకపోయినా నా ఆలోచనల‌తో నా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాను. ఈ ఎన్నికల్లో మీ మద్దతు నాకు ఖచ్చితంగా ఉంటుంది. నాకోసం కాదు ప్రజాస్వామ్యం బతకడం కోసం బతికించుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి’’ అని అన్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us