హనుమకొండ జిల్లా కాజీపేటలో దారుణ ఘటన చోటుచేసుకుంది. డిగ్రీ విద్యార్థి దొరబాబు తన తల్లి ఉదయశ్రీని కత్తితో గొంతు కోసి హత్య చేశాడు. తల్లి ప్రవర్తన నచ్చకపోవడమే హత్యకు కారణమని సమాచారం. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.