రెండు రోజుల క్రితం వైసీపీలో చేరిన కొణతాల రామకృష్ణ మరోసారి ఆ పార్టీకి షాక్ ఇవ్వనున్నారు. ఈ ఉదయం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడుతో కొణతాల సమావేశం అయ్యారు. అనకాపల్లి నుంచి ఎంపీ టికెట్‌ను ఆశించిన ఆయన, జగన్ తిరస్కరించడంతో తాజాగా చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కొణతాలకు చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నేడో, రేపో కొణతాల టీడీపీ కండువాను కప్పుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది.