Kodali Nani: చంద్రబాబు అలా పేరు మార్చుకోవాలి… టీడీపీ అధినేతపై కొడాలి నాని హాట్‌ సెటైర్స్‌

|

Mar 20, 2021 | 2:01 PM

Kodali Nani Satires on Babu: ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై మంత్రి కొడాలినాని తీవ్రస్థాయిలో..

Kodali Nani: చంద్రబాబు అలా పేరు మార్చుకోవాలి... టీడీపీ అధినేతపై కొడాలి నాని హాట్‌ సెటైర్స్‌
Follow us on

Kodali Nani Satires on Babu: ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై మంత్రి కొడాలినాని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు విచారణలు ఎదుర్కోలేని అత్యంత పిరికి వ్యక్తిగా కొడాలి నాని అభివర్ణించారు. భారత దేశంలో కోర్టు విచారణలు అంటే భయపడే ప్రఖ్యాతి గాంచిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయనే నారా చంద్రబాబు నాయుడు అంటూ నాని వ్యాఖ్యానించారు. ఆయనను చంద్రబాబునాయుడు అనే పేరు కంటే స్టేల బాబు అని పిలిస్తే బావుంటుందని కొడాలి నాని ఎద్దేవా చేశారు.

సీఐడీ విచారణలో దొరుకిపోతాననే భయంతోనే, స్టేల బాబు మళ్ళీ కోర్టు నుండి స్టే తెచ్చుకున్నారన్నని కొడాలి నాని విమర్శించారు. చంద్రబాబుకు ఉన్న మేనేజ్మెంట్, పలుకుబడిని ఉపయోగించుకునే కోర్టుల్లో స్టేలు తెచ్చుకుంటున్నారని ఆయన ఆరోపించారు. లక్షలు, కోట్లు ఖర్చుపెట్టి పెద్ద పెద్ద సుప్రీం కోర్టు లాయర్లను తెచ్చుకుంటున్నారన్నారు. కోర్టుల ద్వారా చంద్రబాబు తాత్కాలికంగా స్టేలు తెచ్చుకున్నప్పటికీ ప్రజా కోర్టులో శిక్ష తప్పదని హెచ్చరించారు.

ఏపీల ప్రజలు ఇప్పటికే చంద్రబాబుకు ప్రజలు అనేకసార్లు బుద్ధి చెప్పారని.. రాబోవు జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలు, తిరుపతి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజాక్షేత్రంలో ప్రజలు వేసే శిక్షతో చంద్రబాబు రోడ్డు మీదకు రాకుండా ఇంటికి పరిమితం చేస్తారని తెలిపారు. అతి భయంకరమైన శిక్షను చంద్రబాబుకు రాష్ట్ర ప్రజలు వేయడానికి సిద్ధంగా ఉన్నారని మంత్రి కొడాలి నాని హెచ్చరించారు.

Read More:

Telangana Budget: వరుసగా మూడు నెలలు రేషన్‌ తీసుకోలేదా..? అయితే మీ కార్డు క్యాన్సెల్

Tanzania New President: టాంజానియాలో సరికొత్త చరిత్ర.. అధ్యక్షపీఠంపై తొలిసారిగా మహిళ