Malladi Vasu: క్షమాపణలు చెప్పిన మల్లాది వాసు.. తన వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటున్నట్లు వెల్లడి

|

Dec 02, 2021 | 8:13 AM

కులంలో చీడపురుగుల్లా తయారైన వల్లభనేని వంశీ, కొడాలి నానీలను భౌతికంగా లేకుండా చెయ్యాలంటూ సంచలన కామెంట్స్ చేసిన ఖమ్మం జిల్లా మధిర మున్సిపాలిటీ కౌన్సిలర్ మల్లాది వాసు.. తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు.

Malladi Vasu: క్షమాపణలు చెప్పిన మల్లాది వాసు.. తన వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటున్నట్లు వెల్లడి
Malladi Vasu
Follow us on

కులంలో చీడపురుగుల్లా తయారైన కొడాలి నాని, వల్లభనేని వంశీలను భౌతికంగా లేకుండా చెయ్యాలంటూ సంచలన కామెంట్స్ చేసిన ఖమ్మం జిల్లా మధిర మున్సిపాలిటీ టీఆర్‌ఎస్ కౌన్సిలర్ మల్లాది వాసు.. తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. తాను వ్యక్తిగతంగా ఎవర్నీ ఉద్దేశించి వ్యాఖ్యలు చేయలేదని చెప్పారు. ఎన్టీ రామారావు గారి కుటుంబం మీద ఉన్న అభిమానం, కమ్మ కులానికి జరుగుతోన్న అన్యాయం చూసి బాధపడి వ్యాఖ్యలు చేశానని తెలిపారు. తనకు ఏ రకమైన నేర సంస్కృతి లేదని.. హత్యలు చేయించే సంస్కృతి తనది కాదని చెప్పుకొచ్చారు. గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జరిగిన పరిణామాలు చూసి బాధతో మాట్లాడినట్లు పేర్కొన్నారు. కొంతమంది కావాలని తన వీడియోని వక్రీకరించారని చెప్పుకొచ్చారు. తనకు ఎవరి మీద కక్షలు లేవని.. స్కెచ్ వేయటం.. అందుకోసం డబ్బులు ఖర్చు చేయటం లాంటి ఉద్దేశాలు లేవన్నారు. కమ్మ కమ్యూనిటీ, వెల్ఫేర్, సంక్షేమం కోసం ఖర్చు పెడతానని వివరించారు. తాను మాట్లాడిన మాటలు ఎవరినైనా నొప్పించి ఉంటే క్షమించాలని కోరారు. అంతేకాదు తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని వివరించారు. కుటుంబంలో ఉన్న ఆడవాళ్ళ మీద కామెంట్ చేయడం కరెక్ట్ కాదన్నారు.

Also Read: Akhanda Review: బాలయ్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్.. థియేటర్లలో మాస్ జాతర