K.A. Paul: కేంద్ర హోం మంత్రిని కలిసిన కేఏ పాల్.. జడ్ ప్లస్ సెక్యూరిటీ కేటాయించాలని వినతి..

|

May 13, 2022 | 12:24 AM

K.A. Paul: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాని కలిసారు. తెలంగాణలో శాంతి భద్రతల గురించి సుదీర్ఘంగా చర్చించారు.

K.A. Paul: కేంద్ర హోం మంత్రిని కలిసిన కేఏ పాల్.. జడ్ ప్లస్ సెక్యూరిటీ కేటాయించాలని వినతి..
Ka Paul
Follow us on

K.A. Paul: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాని కలిసారు. తెలంగాణలో శాంతి భద్రతల గురించి సుదీర్ఘంగా చర్చించారు. తనపై జరిగిన దాడి నేపథ్యంలో జడ్ ప్లస్ సెక్యూరిటీ కేటాయించాలని హోంమంత్రిని కోరారు. అదేవిధంగా కేసీఆర్ అవినీతి ఆరోపణలపై విచారణ జరిపించాలని నివేదించారు. ఈ భేటి అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో జరుగుతున్న అవినీతి, అన్యాయం, అక్రమాలు తన జీవితంలో ఎప్పుడు చూడలేదన్నారు. కేసీఆర్ అవినీతి, కేటీఆర్ అక్రమాల వల్లే లక్షల కోట్లు మాయమయ్యాయని తెలిపారు.

దేశం శ్రీలంక మాదిరి అయిపోతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ అప్పు దాదాపు 8 లక్షల కోట్లు అయితే తెలంగాణ అప్పు నాలుగున్నర లక్షల కోట్లు అని పేర్కొన్నారు. తెలంగాణలో తనపై జరిగిన దాడిని కేంద్ర హోం మంత్రి తీవ్రంగా ఖండించారని తెలిపారు. రెండో రోజుల్లో ఆయన తెలంగాణకి వస్తారని హామి ఇచ్చారని చెప్పారు. ప్రజాశాంతి పార్టీ తెలుగు రాష్ట్రాల్లో అన్ని చోట్లా పోటీ చేస్తుందన్నారు. తెలంగాణ డీజీపీ కలుస్తానంటే సమయం లేదన్నారు కానీ కేంద్ర హోంమంత్రి అడగగానే సమయం ఇచ్చారన్నారు. తనపైన కేసీఆర్‌ చేయించిన దాడికి త్వరలోనే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని తెలిపారు.

మరిన్ని రాజకీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

CSK vs MI: ముంబై ఇండియన్స్‌ సూపర్ విక్టరీ.. చెన్నై ప్లే ఆఫ్‌ ఆశలు గల్లంతు..

Health Tips: మీరు 40 ఏళ్లలో 20లా కనిపించాలంటే ఈ సూపర్ ఫుడ్ మీ డైట్‌లో ఉండాల్సిందే..!

Sambar: సాంబార్ రుచిగా ఉండాలంటే ఏం చేయాలి.. ఇంట్లో ఇలా తయారు చేసి చూడండి..!