జమిలి ఎన్నికలు ఆహ్వానించదగ్గ నిర్ణయం అని తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బుధవారం పార్లమెంట్‌లో ప్రధాని మోదీ అధ్యక్షత జరిగిన అఖిలపక్ష సమావేశానికి ఆయన హాజరయ్యారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ వల్ల పార్టీలకు, ప్రభుత్వాలకు ఖర్చు తగ్గుతుందని తెలిపారు. ఒకేసారి ఎన్నికలు జరిగితే బడ్జెట్ పెట్టేందుకు కూడా వీలుగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. జమిలి ఎన్నికలపై అంత తొందరేమీ లేదని ప్రధాని మోదీ కూడా అన్నారని.. అయితే రాష్ట్రాలను బలోపేతం చేస్తే దేశం అభివృద్ధి చెందుతుందని ప్రధానికి తెలిపామన్నారు కేటీఆర్.