మంగళగిరిలో జనసేన పోటీ!

అమరావతి: నామినేషన్ల దాఖలుకు చివరిరోజు జనసేనాని అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఏపీ మంత్రి నారా లోకేష్‌ పోటీ చేస్తున్న మంగళగిరి  స్థానం నుంచి జనసేన అభ్యర్థిని ప్రకటించింది. పొత్తుల్లో భాగంగా సీపీఐకి గతంలో ఈ సీటును కేటాయించిన సంగతి తెలసిందే. అయితే.. అనూహ్యంగా జనసేన తరపున చల్లపల్లి శ్రీనివాస్‌కు బీఫారం ఇచ్చింది . సీపీఐ తరపున కమ్యూనిష్టు నాయకుల్లో మంచి పేరున్న  ముప్పాళ్ల నాగేశ్వరరావు నామినేషన్‌ వేసేందుకు సిద్ధమవుతుండగా…జనసేన హాడావిడిగా అభ్యర్థిని ప్రకటించడం చర్చనీయాంశమైంది. మొదట మంగళగిరి […]

మంగళగిరిలో జనసేన పోటీ!

Updated on: Mar 25, 2019 | 11:02 AM

అమరావతి: నామినేషన్ల దాఖలుకు చివరిరోజు జనసేనాని అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఏపీ మంత్రి నారా లోకేష్‌ పోటీ చేస్తున్న మంగళగిరి  స్థానం నుంచి జనసేన అభ్యర్థిని ప్రకటించింది. పొత్తుల్లో భాగంగా సీపీఐకి గతంలో ఈ సీటును కేటాయించిన సంగతి తెలసిందే. అయితే.. అనూహ్యంగా జనసేన తరపున చల్లపల్లి శ్రీనివాస్‌కు బీఫారం ఇచ్చింది . సీపీఐ తరపున కమ్యూనిష్టు నాయకుల్లో మంచి పేరున్న  ముప్పాళ్ల నాగేశ్వరరావు నామినేషన్‌ వేసేందుకు సిద్ధమవుతుండగా…జనసేన హాడావిడిగా అభ్యర్థిని ప్రకటించడం చర్చనీయాంశమైంది.

మొదట మంగళగిరి బరిలో అభ్యర్థిని నిలపకపోవడంతో…జనసేన, టీడీపీతో లోపాయకారి ఒప్పందం చేసుకుందనే విమర్శలు రావడంతో పాటు స్థానికంగా ఉన్న పార్టీ కేడర్‌ను కాపాడుకునేందుకు జనసేన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.  ఇక.. ఈ స్థానం నుంచి వైసీపీ తరపున సిట్టింగ్ ఎమ్యెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పోటీ చేస్తున్నారు. జనసేన ఎంట్రీతో మంగళగిరి పోరు ఆసక్తికరంగా మారింది.