ఆధ్యాత్మిక నగరానికి జనసేనాని.. తిరుపతి ఉపఎన్నిక అభ్యర్థిపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం.?

జనసేన అధినతే పవన్ కల్యాణ్‌ రేపటి తిరుపతి పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. అక్కడ జరిగే పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశానికి..

ఆధ్యాత్మిక నగరానికి జనసేనాని.. తిరుపతి ఉపఎన్నిక అభ్యర్థిపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం.?

Updated on: Jan 20, 2021 | 2:20 PM

జనసేన అధినతే పవన్ కల్యాణ్‌ రేపటి తిరుపతి పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. అక్కడ జరిగే పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశానికి పవన్‌ హాజరు కానున్నారు. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపిక అంశంపై ఈ సమావేశంలో జనసేన కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది.

గ్రేటర్ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో తాము పోటీ చేయకుండా బీజేపీకి మద్దతు ఇచ్చామనే విషయాన్ని గుర్తు చేస్తున్న జనసేన నేతలు.. తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం తమకు ఇవ్వాలని బీజేపీని కోరే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇందుకు సంబంధించి జనసేన సమావేవశంలో తీర్మానం చేస్తారా ? అనే రాజకీయ ఉత్కంఠకు రేపు తెరపడనుంది.

ఏపీలో తమ బలం చాటుకోవడానికి తిరుపతి ఉప ఎన్నికను వాడుకోవాలనే పట్టుదలతో జనసేన పార్టీ ఉన్నట్లు తెలుస్తుంది. తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్న అభ్యర్థుల జాబితాను కూడా జనసేన సిద్ధం చేసినట్లు సమాచారం. మొత్తానికి రేపటి తిరుపతి పర్యటనలో పవన్‌ కల్యాణ్‌ జనసేన అభ్యర్థిని ప్రకటించి బీజేపీకి షాక్ ఇస్తారా ? లేక జీహెచ్‌ఎంసీలో మాదిరిగా తప్పుకుంటారా అనేది ఆసక్తిగా మారింది.