Pawan Kalyan: ఏపీలో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధిస్తుంది.. పిఠాపురంలో పవన్ కల్యాణ్ నామినేషన్

పిఠాపురం జనసేన అభ్యర్థిగా ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. పవన్ కల్యాణ్ వెంట నాగబాబు, టీడీపీ నేత వర్మ తదితరులు ఉన్నారు. నామినేషన్ దాఖలకు ముందు పవన్ కల్యాణ్ భారీ ర్యాలీ నిర్వహించారు. చేబ్రోలులోని పవన్‌ నివాసం నుంచి గొల్లప్రోలు మీదుగా పిఠాపురం వరకు ర్యాలీ నిర్వహించారు.

Pawan Kalyan: ఏపీలో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధిస్తుంది.. పిఠాపురంలో పవన్ కల్యాణ్ నామినేషన్
Janasena Pawan Kalyan
Follow us

|

Updated on: Apr 23, 2024 | 3:58 PM

పిఠాపురం జనసేన అభ్యర్థిగా ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. పవన్ కల్యాణ్ వెంట నాగబాబు, టీడీపీ నేత వర్మ తదితరులు ఉన్నారు. నామినేషన్ దాఖలకు ముందు పవన్ కల్యాణ్ భారీ ర్యాలీ నిర్వహించారు. చేబ్రోలులోని పవన్‌ నివాసం నుంచి గొల్లప్రోలు మీదుగా పిఠాపురం వరకు ర్యాలీ నిర్వహించారు. పవన్‌ ర్యాలీలో కూటమి (టీడీపీ – బీజేపీ – జనసేన) నాయకులు, కార్యకర్తలు నేతలు భారీగా పాల్గొన్నారు. పిఠాపురం పాదగయ సెంటర్‌ వరకు పవన్‌ ర్యాలీ కొనసాగింది. అనంతరం పవన్ కల్యాణ్ నామినేషన్ సెట్లను ఆర్వోకు అందజేశారు. పిఠాపురం అసెంబ్లీకి నామినేషన్ దాఖలు అనంతరం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. త్యాగాల్లో భాగంగా మండపేట, రామచంద్రపురం,పెద్దాపురంతో పాటు 30, 40 చోట్ల తమ అభ్యర్థుల్ని విత్ డ్రా చేసుకుని సర్దుకోమని చెప్పానన్నారు.

ప్రజల్లో బలమైన నాయకుడు, మాజీ ఎమ్మెల్యే వర్మ తన కోసం సీటు త్యాగం చేశారని.. వర్మకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం త్యాగం చేశారంటూ పేర్కొన్నారు. కాకినాడ ఎంపీ అభ్యర్థి ఉదయ శ్రీనివాస్ ను గెలిపిస్తే పార్లమెంట్‌లో గట్టిగా మాట్లాడుతారంటూ పేర్కొన్నారు. ఎన్నికల కోసం కూటమి సభ్యులందరూ మనస్ఫూర్తిగా పనిచేస్తున్నారన్నారు. మీడియాకు అండగా ఉంటాం.. మీడియా కష్టాల్లో పాలు పంచుకుంటాం.. అంటూ పవన్ భరోసానిచ్చారు. ఒకటో తారీఖున పింఛన్ ఇవ్వట్లేదంటే ప్రభుత్వ వైఫల్యమే… పింఛన్ల పంపిణీలో ప్రభుత్వం కుట్ర ఉందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఘన విజయం సాధించబోతుందని.. పవన్ జోస్యం చెప్పారు.

Pawan Kalyan

Pawan Kalyan

కాగా.. పవన్ కల్యాణ్ సాయంత్రం 6గంటలకు ఉప్పాడలో జరిగే కూటమి బహిరంగసభలో పాల్గొని ప్రసంగించనున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..