అమరావతి : జనసేన పార్టీ ఏపీకి సంబంధించిన మూడోజాబితా విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని మరో 13 శాసనసభ స్థానాలకు, మరో లోక్‌సభ స్థానానికి జనసేన నుంచి పోటీ చేసే అభ్యర్థుల జాబితాను పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ సోమవారం అర్ధరాత్రి ప్రకటించారు. కాగా ఆదివారం విడుదల చేసిన రెండో జాబితాలో ఒక అభ్యర్థి స్థానాన్ని మార్చారు. గిద్దలూరు స్థానం నుంచి ముందుగా ప్రకటించిన షేక్‌రియాజ్ తాజా మార్పులో భాగంగా ఒంగోలు శాసనసభ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. గిద్దలూరు స్థానం నుంచి బైరబోయిన చంద్రశేఖర్ యాదవ్ పోటీ చేస్తారని జనసేన ప్రకటించింది.
జనసేన పార్టీ 3వ జాబితా విడుదల pic.twitter.com/Y7PMFQEks1
— JanaSena Party (@JanaSenaParty) March 18, 2019