జగన్‌కు ముఖ్యమంత్రి పదవి పిచ్చి పట్టింది: దేవినేని ఉమా

విజయవాడ: టీడీపీ నాయకులు, మంత్రి దేవినేని ఉమా మీడియాతో మాట్లాడారు. కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున పోటీ చేస్తున్న ఆయన జగన్ మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. మైలవరంలో ఎన్నికల ప్రచారం కోసం రిటర్నింగ్ ఆఫీసర్, పోలీసు అధికారులు నిర్దేశించిన మార్గంలో కాకుండా ప్రజల మధ్యలో నుంచి ఎందుకు జగన్ వేదిక మీదకు రావాల్సి వచ్చింది అని ఉమా ప్రశ్నించారు. వచ్చిన తర్వాత మీడియా మీద ఉద్దేశపూర్వకంగా దాడి చేశారు. ఆ తర్వాత […]

జగన్‌కు ముఖ్యమంత్రి పదవి పిచ్చి పట్టింది: దేవినేని ఉమా

Edited By:

Updated on: Apr 04, 2019 | 7:35 PM

విజయవాడ: టీడీపీ నాయకులు, మంత్రి దేవినేని ఉమా మీడియాతో మాట్లాడారు. కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున పోటీ చేస్తున్న ఆయన జగన్ మీద ఆగ్రహం వ్యక్తం చేశారు.

మైలవరంలో ఎన్నికల ప్రచారం కోసం రిటర్నింగ్ ఆఫీసర్, పోలీసు అధికారులు నిర్దేశించిన మార్గంలో కాకుండా ప్రజల మధ్యలో నుంచి ఎందుకు జగన్ వేదిక మీదకు రావాల్సి వచ్చింది అని ఉమా ప్రశ్నించారు. వచ్చిన తర్వాత మీడియా మీద ఉద్దేశపూర్వకంగా దాడి చేశారు. ఆ తర్వాత కూడా అధికారులను భయపెట్టాలని చూశారు. జగన్ ఒక మానసిక వ్యాధితో బాధపడుతున్నారు, ఒక ముఖ్యమంత్రి పదవి పిచ్చి పట్టిందంటూ ఉమా ఫైరయ్యారు.

జగన్ నిన్న జరిగిన మైలవరం సభలో కార్యకర్తలు, నాయకులను రెచ్చగొట్టారు. ఆయన సభా వేదిక దిగగానే సిఎస్ఎఫ్ సిబ్బంది మీద కొందరు చెప్పులు, రాళ్లు వేసారంటే వైసీపీ ఎలాంటి కుట్రలు చేస్తుందో అర్ధం చేసుకోవచ్చు. ఇంకెన్ని కుట్రలకు పాల్పడతారో, దీనిమీద ఎలక్షన్ కమీషన్ దృష్టి పెట్టాలని ఉమా అన్నారు. ప్రచారంలో ఎక్కడా కూడా తాను అధికారంలోకి వస్తే ఏం చేస్తానో చెప్పకుండా నన్ను, సీఎంను తిట్టడమే పనిగా పెట్టకున్నారని ఉమా అన్నారు.