దొర కారులో జగన్ షికారు: లోకేశ్

|

Mar 13, 2019 | 4:41 PM

విజయవాడ: ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో ఏపీ మంత్రి నారా లోకేశ్ సోషల్ మీడియాలో సూపర్ యాక్టీవ్‌గా స్పందిస్తున్నారు. ప్రతిపక్షాలకు గట్టి కౌంటర్లు ఇస్తున్నారు. ప్రతిపక్ష నేత జగన్‌పై నారా లోకేశ్ సోషల్ మీడియాలో వ్యంగ్యంగా స్పందించారు. నెల్లూరు జిల్లాలో ఈరోజు టీఆర్ఎస్ గుర్తు ఉన్న కార్లను ప్రచారానికి వైసీపీ నేతలు సిద్ధం చేస్తుకుంటున్నారంటూ పలు ఫొటోలు నెట్టింట్లో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆ ఫొటోలను లోకేశ్ తన ట్విట్టర్‌లో పోస్ట్ చేసి అందుకు వ్యంగ్యంగా కామెంట్ […]

దొర కారులో జగన్ షికారు: లోకేశ్
Follow us on

విజయవాడ: ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో ఏపీ మంత్రి నారా లోకేశ్ సోషల్ మీడియాలో సూపర్ యాక్టీవ్‌గా స్పందిస్తున్నారు. ప్రతిపక్షాలకు గట్టి కౌంటర్లు ఇస్తున్నారు. ప్రతిపక్ష నేత జగన్‌పై నారా లోకేశ్ సోషల్ మీడియాలో వ్యంగ్యంగా స్పందించారు.

నెల్లూరు జిల్లాలో ఈరోజు టీఆర్ఎస్ గుర్తు ఉన్న కార్లను ప్రచారానికి వైసీపీ నేతలు సిద్ధం చేస్తుకుంటున్నారంటూ పలు ఫొటోలు నెట్టింట్లో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆ ఫొటోలను లోకేశ్ తన ట్విట్టర్‌లో పోస్ట్ చేసి అందుకు వ్యంగ్యంగా కామెంట్ పెట్టారు.

లోకేశ్ పెట్టిన కామెంట్..

“తెలంగాణ దొరగారి కారు…ఆంధ్రాలో జగన్ షికారు!
వైకాపా కారు చూడ మేలిమై ఉండు
సీటు విప్పిచూడ కారు గుర్తు ఉండు.
రంగు మార్చుడెందుకు కలువకుంట జగన్ గారూ,
దొరగారి ప్ర“గఢీ“భవన్ గులాబీ తోటలో పువ్వే మీరు!”

https://twitter.com/naralokesh/status/1105755474488672256