వైసీపీలో చేరుతున్నట్టు ప్రకటించిన డీఎల్ రవీంద్రారెడ్డి

| Edited By:

Mar 20, 2019 | 3:05 PM

కడప: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టు మాజీమంత్రి డీఎల్‌ రవీంద్రారెడ్డి ప్రకటించారు. వైఎస్‌ జగన్ తనకు ఫోన్‌ చేశారని, మీ సేవలు అవసరం పార్టీలోకి రావాలని కోరినట్టు డీఎల్ తెలిపారు. వైఎస్‌ వివేకానందరెడ్డి స్థానాన్ని భర్తీ చేయాలని జగన్‌ కోరారు అని తెలిపారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకుని, పది రోజుల్లో భారీ సమావేశం ఏర్పాటు చేస్తా అని డీఎల్ ప్రకటించారు. రాష్ట్రంలో వైఎస్సార్‌ సీపీ గెలుపు కోసం కృషి చేస్తా. సజ్జల రామకృష్ణ […]

వైసీపీలో చేరుతున్నట్టు ప్రకటించిన డీఎల్ రవీంద్రారెడ్డి
Follow us on

కడప: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టు మాజీమంత్రి డీఎల్‌ రవీంద్రారెడ్డి ప్రకటించారు. వైఎస్‌ జగన్ తనకు ఫోన్‌ చేశారని, మీ సేవలు అవసరం పార్టీలోకి రావాలని కోరినట్టు డీఎల్ తెలిపారు. వైఎస్‌ వివేకానందరెడ్డి స్థానాన్ని భర్తీ చేయాలని జగన్‌ కోరారు అని తెలిపారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకుని, పది రోజుల్లో భారీ సమావేశం ఏర్పాటు చేస్తా అని డీఎల్ ప్రకటించారు. రాష్ట్రంలో వైఎస్సార్‌ సీపీ గెలుపు కోసం కృషి చేస్తా.

సజ్జల రామకృష్ణ రెడ్డి, ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డి బుధవారం ఉదయం ఖాజీపేటలో డీఎల్‌ రవీంద్రారెడ్డిని కలిశారు. అనంతరం డీఎల్ మీడియాతో మాట్లాడారు. సజ్జల రామకృష్ష్ణారెడ్డి మాట్లాడుతూ.. డీఎల్‌ రవీంద్రారెడ్డి పార్టీలోకి రావడం ఆనందంగా ఉందన్నారు. ఆయన రాకతో పార్టీలో నూతన ఉత్సహం వస్తుంది. అధికారంలోకి రాగానే డీఎల్‌కు ప్రత్యేక స్థానం ఇస్తామని వైఎస్‌ జగన్ చెప్పారని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన‍్నారు.