తెలంగాణ రాజధాని విశ్వనగరం హైదరాబాద్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. కోతులు వాపస్ పోవాలి.. వానలు వాపస్ రావాలి అనే నినాదంతో మొదలు పెట్టిన హరిత హారం కార్యక్రమం రాష్ట్రంలో విజయవంతంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. తెలంగాణను ఆకుపచ్చ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారు. ఇందుకోసం ఏటా కోట్ల సంఖ్యలో మొక్కలు నాటుతున్నారు.
తెలంగాణ ఏర్పాటు తర్వాత విజయవంతంగా కొనసాగుతున్న హరితహారంతో తెలంగాణ నేల ఆకుపచ్చగా మారుతోంది. ఎక్కడ చూసినా పచ్చదనమే పలుకరిస్తోంది. హరిత తెలంగాణ కోసం ప్రయత్నిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి మరో అరుదైన గుర్తింపు లభించింది. ఆర్బర్ డే ఫౌండేషన్ అనే సంస్థ.. 2020 ట్రీ సిటీగా హైదరాబాద్‌ను ప్రకటించింది. హరితహారం విజయవంతం అయిందనడానికి ఈ గుర్తింపే నిదర్శనం. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్‌గా హైదరాబాద్‌ను ఆర్బర్ డే ఫౌండేషన్ గుర్తించడం చాలా సంతోషంగా ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. ఆర్బర్ డే ఫౌండేషన్ ట్రీ సిటీ జాబితాలో ఇండియా నుంచి హైదరాబాద్ నగరం ఒక్కటే ఎంపిక కావడం విశేషం. హరితహారం కార్యక్రమంలో భాగంగా పచ్చదనాన్ని పెంచేందుకు తాము చేసిన ప్రయత్నాలకు ఇది గుర్తింపు అని కేటీఆర్ అన్నారు. హరితహారంలో భాగంగా హైదరాబాద్‌లో 2020 ఏడాది వరకు 2.4 కోట్ల మొక్కలు నాటినట్లు ఆర్బర్ డే ఫౌండేషన్ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది.
Happy to share that @arborday foundation (which works with FAO of UN) has recognised Hyderabad as a Tree city of the world. The only Indian city to be included in this list
This is an acknowledgement of our efforts to improve green cover as part of #HarithaHaaram program ? pic.twitter.com/nflM0svV2k
— KTR (@KTRTRS) February 18, 2021
Read more:
ఏపీలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్ విడుదల.. ఎన్నికలు జరిగే ఎమ్మెల్సీ స్థానిలు ఇవే..