తెలంగాణ బిజెపి నేతలకు అధిష్టానం షాక్.. ఎందుకంటే?

| Edited By: Srinu

Nov 26, 2019 | 5:27 PM

ప్రజా క్షేత్రంలో పోరాటాలలో తమకు తామే సాటి అనుకుంటున్న తెలంగాణ బిజెపి నేతలకు పార్టీ అధిష్టానం దూతలు షాకిచ్చారు. దూతల మాటే అధిష్టానం మాటయితే తమ పరిస్థితి ఏంటా? అని తెలంగాణ కమలం నేతలు మధనపడుతున్నారు. అర్జంట్‌గా అధిష్టానం ఏం కోరుకుంటుందో అది చేసేయాలని కాషాయం నేతలు డిసైడ్ అయ్యారని విశ్వసనీయ సమాచారం. ఇంతకీ ఏ విషయంలో కమలం నేతలు ఖంగుతిన్నారు? ఇప్పుడేం చేయాలని డిసైడయ్యారు? బిజెపి నేతలకు దిశానిర్దేశం చేసేందుకు, వచ్చే ఎన్నికల నాటికి పార్టీ […]

తెలంగాణ బిజెపి నేతలకు అధిష్టానం షాక్.. ఎందుకంటే?
Follow us on

ప్రజా క్షేత్రంలో పోరాటాలలో తమకు తామే సాటి అనుకుంటున్న తెలంగాణ బిజెపి నేతలకు పార్టీ అధిష్టానం దూతలు షాకిచ్చారు. దూతల మాటే అధిష్టానం మాటయితే తమ పరిస్థితి ఏంటా? అని తెలంగాణ కమలం నేతలు మధనపడుతున్నారు. అర్జంట్‌గా అధిష్టానం ఏం కోరుకుంటుందో అది చేసేయాలని కాషాయం నేతలు డిసైడ్ అయ్యారని విశ్వసనీయ సమాచారం. ఇంతకీ ఏ విషయంలో కమలం నేతలు ఖంగుతిన్నారు? ఇప్పుడేం చేయాలని డిసైడయ్యారు?

బిజెపి నేతలకు దిశానిర్దేశం చేసేందుకు, వచ్చే ఎన్నికల నాటికి పార్టీ పరిస్థితి మెరుగుపరిచేందుకు పార్టీ పంపిన దూతలు తరచూ హైదరాబాద్‌కు వస్తూనే వున్నారు. వీరంతా కేవలం హైదరాబాద్‌కు పరిమితం కాకుండా జిల్లాల్లోను విస్తృతంగా పర్యటించి, పార్టీ పరిస్థితిని, పార్టీ కార్యవర్గాల పనితీరును పరిశీలిస్తూ వుంటారు. అవసరాన్ని బట్టి తగిన సూచనలు చేస్తూ సమీక్ష సమావేశాల వివరాలను అధిష్టానం దగ్గరికి మోసుకుపోతూ వుంటారు.

ఇటీవల కాలంలో బిజెపి అధిష్టానం దూతలుగా సునీల్ ధియోరా లాంటి నేతలు తెలంగాణ జిల్లాల్లో పర్యటించి వెళ్ళారు. రాష్ట్ర స్థాయితోపాటు.. వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్‌నగర్ పాత జిల్లాల స్థాయిలో పార్టీ శ్రేణులతో ఆయన ఇంటరాక్టయ్యారు. ఇదంతా బాగానే వుంది. ఈ సమీక్షల్లో ఆయన అడిగిన ఓ ప్రశ్న తెలంగాణ కమలం నేతలకు షాకిచ్చిందట. ప్రధాన నేతలను ఒక్కో నేత మీద ఎన్ని పోలీసు కేసులున్నాయని ఆయన ప్రశ్నించారంట. దాంతో ఒకరిద్దరు మినహా తమపై కేసులేమీ లేవని, అది తమ గొప్పతనం అన్నట్లుగా చెప్పుకున్నారంట. దాంతో సునీల్ వెంటనే… ఒక్క కేసు కూడా నమోదు కాకుండా మీరంతా టిఆర్ఎస్ ప్రభుత్వం మీద ఎలా పోరాడుతున్నారని ఎదురు ప్రశ్న వేశారంట.

ఢిల్లీ వచ్చినప్పుడు భారీ జాబితాలతో అది చేశాం.. ఇది చేశాం.. అని క్లెయిమ్ చేసుకుంటుంటారు.. కానీ కింది స్థాయికి వచ్చేసరికి ఒక్క కేసూ లేదా ? అని సునీల్ ధియోరా ప్రశ్నించే సరికి అంతా అవాక్కయ్యారంట. ధర్నాలు, బంద్‌లు చేసినపుడు వాటి తీవ్రత ప్రభుత్వాలకు తెలియాలంటే అగ్రెషన్ చూపించాల్సి వుంటుంది. అగ్రెషన్ చూపిస్తే కేసులు తప్పకుండా అవుతాయి. మరి మీలో ఎవరి మీద కేసులు లేకపోతే మీరు ఉద్యమాల్లో దూకుడెక్కడ ప్రదర్శించినట్లు అని ఆయన కమలం నేతలకు క్లాస్ పీకారట. దాంతో నిశ్చేష్టులైన బిజెపి నేతలు.. ఇక తామంతా రూటు మార్చి, గేరు వేయాల్సి వుందని అనుకుంటున్నారంట.