MLA Kethireddy Venkatarami Reddy: చేతిలో అధికారం ఉంటే చంపేస్తావా… అంటూ అనంతపురం జిల్లా కలెక్టర్‌పై విరుచుకపడ్డారు వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి. అనంతపురం జిల్లా ధర్మవరంలోని చిల్లవారిపల్లి జరిగిన సంఘటన జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు, ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి మధ్య వివాదం రాజేసింది. కాట కోటేశ్వరస్వామి ఆలయ జాతర విషయంలో అంకేను పల్లె, చిల్లవారిపల్లి మధ్య గొడవ జరుగుతుంది. గుర్రాలు ఎవరు తీసుకెళ్లాలనే ఇష్యూలో కొన్నేళ్ల నుంచి వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో పూజలు చేసుకుంటే తప్పులేదని… గొడవలు జరిగేలా ఉంటే జాతర వద్దని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆర్డర్ వేశారు. దీన్ని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి తప్పుపట్టారు.
అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడుపై ఎమ్మెల్యే కేతిరెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు దళిత సంఘాలకు ఆగ్రహం తెప్పించాయి. ఎమ్మెల్యేపై కేసు నమోదు చేయాలంటూ ఎస్పీకి ఫిర్యాదు చేశాయి. కేసు నమోదు చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన తప్పదని హెచ్చరించారు దళిత నాయకులు. జిల్లావ్యాప్తంగా దళిత ఉద్యోగులంతా నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతున్నారు. జాతర విషయంలో నేతల మధ్య ఆధిపత్య పోరు వల్ల గొడవలు జరిగే ఛాన్స్ ఉందన్న సమాచారంతోనే జాతరపై ఆంక్షలు విధించినట్టు కలెక్టరేట్ వర్గాలు చెబుతున్నాయి. దీంతోపాటు కేతిరెడ్డికి పెట్టిన కొన్ని కీలక ప్రపోజల్స్‌ను కలెక్టర్ గంధం చంద్రుడు రిజెక్ట్ చేశారని… అందుకే ఆయనపై ఎమ్మెల్యేకు కోపం ఉందన్న గుసగుసలు వినిపిస్తన్నాయి. అసలు సంగతి తెలుసుకున్న ప్రభుత్వం పెద్దలు… కేతిరెడ్డికి క్లాస్ పీకినట్టు ఇన్ఫర్మేషన్. కలెక్టర్లపై ఇష్టమొచ్చినట్టు మాట్లాడటం సరికాదని అన్నట్టు తెలుస్తోంది. రెండు రోజుల క్రితం అంతెత్తు ఎగిరిన కేతిరెడ్డి ప్రభుత్వ పెద్దల క్లాస్‌తోనే ప్రస్తుతం సైలెంట్ మోడ్‌లోకి వెళ్లిపోయారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాజకీయ ఆధిపత్యపోరు కూడా ఈ వివాదంలో కీలక పాత్ర ఉందన్న టాక్ నడుస్తోంది.
Also Read: బయట నుంచి చూస్తే టమాట పంటేగా అనుకుంటారు.. లోపలికి వెళ్లి చూసిన పోలీసుల మైండ్ బ్లాంక్ అయ్యింది