నాకు కుల గజ్జి లేదు.. జగన్‌తో ఎలాంటి తగాదాలు లేవు – హీరో శివాజీ

| Edited By:

Apr 08, 2019 | 1:59 PM

మరో నాలుగు రోజుల్లో ఎన్నికలు ఉండగా పోలవరంపై హీరో శివాజీ ప్రజెంటేషన్ చేశారు. పోలవరం అద్భుతమైన ప్రాజెక్ట్‌ అని ఆయన అన్నారు. ప్రాజెక్టును ఎవరు పూర్తి చేస్తారో వాళ్లకే ఓటు వేయాలని సూచించారు. ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తోందని అన్నారు. అయితే తన దృష్టికి వచ్చిన కొన్ని నిజాలు చెబుతున్నాను అని శివాజీ తెలిపారు. పోలవరం ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం అడ్డుకుంటుందని.. ప్రాజెక్టును ఆపేందుకు ప్రధాని మోదీ కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. ఇలాంటి కేసీఆర్‌తో […]

నాకు కుల గజ్జి లేదు.. జగన్‌తో ఎలాంటి తగాదాలు లేవు - హీరో శివాజీ
Follow us on

మరో నాలుగు రోజుల్లో ఎన్నికలు ఉండగా పోలవరంపై హీరో శివాజీ ప్రజెంటేషన్ చేశారు. పోలవరం అద్భుతమైన ప్రాజెక్ట్‌ అని ఆయన అన్నారు. ప్రాజెక్టును ఎవరు పూర్తి చేస్తారో వాళ్లకే ఓటు వేయాలని సూచించారు. ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తోందని అన్నారు. అయితే తన దృష్టికి వచ్చిన కొన్ని నిజాలు చెబుతున్నాను అని శివాజీ తెలిపారు. పోలవరం ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం అడ్డుకుంటుందని.. ప్రాజెక్టును ఆపేందుకు ప్రధాని మోదీ కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. ఇలాంటి కేసీఆర్‌తో జగన్ ఎందుకు స్నేహం చేస్తున్నారో అర్థం కావటం లేదన్నారు. కేసీఆర్‌తో జగన్ స్నేహం పులిమీద స్వారీ లాంటిదేనని వ్యాఖ్యానించారు. జగన్ తో తనకు ఎలాంటి శత్రుత్వం లేదని అన్నారు. అలాగే తనకేమి కులగజ్జి లేదని.. తాను ఏ పార్టీకి చెందిన వాడిని కాదనీ హీరో శివాజీ అన్నారు.