ఎన్నికలకు పటిష్ఠ భద్రత ఏర్పాటు: గోపాలకృష్ణ ద్వివేది

| Edited By:

Mar 30, 2019 | 12:54 PM

ఏపీలో ఏప్రిల్ 11న ఎన్నికల సందర్భంగా నిర్వహణా ఏర్పాట్లపై మాట్లాడారు ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది. ఇప్పటికే.. ఈవీఎంలలో ఉంచే బ్యాలెట్ పత్రాల ముద్రణ కూడా ప్రారంభించినట్లు తెలిపారు. బ్యాలెట్‌ పేపర్లలో ఫొటోలు కూడా పెట్టాల్సి ఉన్నందున ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా ఒకటికి పదిసార్లు చెక్ చేసి ముద్రణకు ఇస్తున్నట్లు తెలిపారు. అలాగే.. 2018 ఎన్నికల్లో ఓటింగ్‌ శాతం తక్కువగా నమోదైందని.. ఈసారి దానిని పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. స్వచ్ఛంద […]

ఎన్నికలకు పటిష్ఠ భద్రత ఏర్పాటు: గోపాలకృష్ణ ద్వివేది
Follow us on

ఏపీలో ఏప్రిల్ 11న ఎన్నికల సందర్భంగా నిర్వహణా ఏర్పాట్లపై మాట్లాడారు ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది. ఇప్పటికే.. ఈవీఎంలలో ఉంచే బ్యాలెట్ పత్రాల ముద్రణ కూడా ప్రారంభించినట్లు తెలిపారు. బ్యాలెట్‌ పేపర్లలో ఫొటోలు కూడా పెట్టాల్సి ఉన్నందున ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా ఒకటికి పదిసార్లు చెక్ చేసి ముద్రణకు ఇస్తున్నట్లు తెలిపారు.

అలాగే.. 2018 ఎన్నికల్లో ఓటింగ్‌ శాతం తక్కువగా నమోదైందని.. ఈసారి దానిని పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. స్వచ్ఛంద సంస్థల ద్వారా ఓటర్లలో చైతన్యం తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఎలాంటి ఘర్షణలకు తావు లేకుండా గట్టి భద్రతా చర్యలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఎన్నికలకు కొద్ది రోజులే గడువు ఉండటంతో చాలా అప్రమత్తంగా ఉండాలని ఎలక్షన్ సిబ్బందికి సూచించారు గోపాలకృష్ణ ద్వివేది. ఏపీలో పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి రావడంతో మరింత టెన్షన్ నెలకొంది.