ఆళ్లగడ్డలో మంత్రి అఖిలప్రియ‌కు ఝలక్

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కర్నూలు జిల్లాలో టీడీపీకి మరో షాక్ తగిలింది. మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత గంగుల ప్రతాప్‌రెడ్డి.. మంత్రి అఖిలప్రియకు ఝలక్‌ ఇచ్చారు. ఎన్నికల వేళ‌ ఆళ్లగడ్డ వైసీపీ అభ్యర్థికి మద్దతు తెలిపారు. మంగళవారం వైసీపీ అభ్యర్థి గంగుల బ్రిజేంద్రరెడ్డిని కలిసి ఎన్నికల వ్యూహాలపై చర్చించి.. బ్రిజేంద్రకు ప్రతాప్‌రెడ్డి సూచనలు, సలహాలు ఇచ్చారు. ఆళ్లగడ్డలో గంగుల వర్గీయులు, ప్రజలు బ్రిజేంద్రరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని గంగుల ప్రతాప్‌రెడ్డి కోరారు. నంద్యాల ఉప ఎన్నిక […]

ఆళ్లగడ్డలో మంత్రి అఖిలప్రియ‌కు ఝలక్

Edited By:

Updated on: Apr 03, 2019 | 11:39 AM

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కర్నూలు జిల్లాలో టీడీపీకి మరో షాక్ తగిలింది. మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత గంగుల ప్రతాప్‌రెడ్డి.. మంత్రి అఖిలప్రియకు ఝలక్‌ ఇచ్చారు. ఎన్నికల వేళ‌ ఆళ్లగడ్డ వైసీపీ అభ్యర్థికి మద్దతు తెలిపారు. మంగళవారం వైసీపీ అభ్యర్థి గంగుల బ్రిజేంద్రరెడ్డిని కలిసి ఎన్నికల వ్యూహాలపై చర్చించి.. బ్రిజేంద్రకు ప్రతాప్‌రెడ్డి సూచనలు, సలహాలు ఇచ్చారు.

ఆళ్లగడ్డలో గంగుల వర్గీయులు, ప్రజలు బ్రిజేంద్రరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని గంగుల ప్రతాప్‌రెడ్డి కోరారు. నంద్యాల ఉప ఎన్నిక సమయంలో చంద్రబాబు తనను సాయం కోరారని.. అందుకే టీడీపీ అభ్యర్థి కోసం పనిచేశానన్నారు. నంద్యాల పార్లమెంట్‌కు సరైన అభ్యర్థి ఎవరూ లేరని తనతో చెప్పారన్నారు. కానీ అభ్యర్థిని తనకు చెప్పకుండానే ఎంపిక చేశారన్నారు ప్రతాప్‌రెడ్డి .

మాజీ ఎంపీ గంగుల ప్రతాప్‌రెడ్డి నంద్యాల ఉప ఎన్నికల సమయంలో టీడీపీలో చేరారు. పార్టీ గెలుపు కోసం పనిచేశారు.. ఈసారి ఎన్నికల్లో పోటీచేయాలని భావించారు. నంద్యాల ఎంపీ టికెట్ ఆశించినా దక్కలేదు. అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు గంగుల దూరంగా ఉంటున్నారు. ఎన్నికలకు ముందు వైసీపీకి మద్దతు ప్రకటించారు.