తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీలో ముసలం ఏర్పడింది. రాజ్యసభ ఎంపీలలో నలుగురు ఎంపీలు పార్టీ వీడి, బీజేపీలోకి చేరారు. సుజనా చౌదరి, సీఎం రమేష్, గరికపాటి, టీజీ వెంకటేష్ తమను సభలో ప్రత్యేక బృందంగా గుర్తించాలని కోరుతూ రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడికి లేఖ రాశారు. వీరు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాతో ఇదివరకే చర్చలు జరిపారు. వీరిని బీజేపీ అనుబంధ సభ్యులుగా చేరుకునే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నలుగురు ఎంపీల చేరిక బాధ్యతను జేపీ నడ్డాకు అమిత్ షా అప్పగించారు. అటు.. మరో ఇద్దరి ఎంపీలతోనూ బీజేపీ టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా వారు వెంకయ్యనాయుడికి ఇచ్చిన లేఖ పూర్తిపాఠం ఇలా ఉంది.