Ch Vittal – BJP: తెలంగాణ బీజేపీలో చేరికలు జోరందుకున్నాయి. తాజాగా తెలంగాణ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు సీహెచ్.విఠల్ సోమవారం భారతీయ జనతా పార్టీ(బీజేపీ)లో చేరారు. కేంద్రమంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ సమక్షంలో బీజేపీలో చేరారు. తరుణ్‌ఛుగ్, బండి సంజయ్ విఠల్‌ను పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణ జేఏసీ ప్రధాన కార్యదర్శిగా, కో-ఛైర్మన్‌గా ఆయన తెలంగాణ ఉద్యమంలో ఆయన కీలకపాత్ర పోషించారు. రాష్ట్ర ఆవిర్భావం అనంతరం టీఎస్‌పీఎస్సీ సభ్యుడిగా నియమితులైన విఠల్ పదవీకాలం ఏడాది క్రితం ముగిసింది. ఆదివారమే ఢిల్లీకి చేరుకున్న విఠల్ జాతీయ నేతల సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు.
అయితే టీఎస్‌పీఎస్పీ సభ్యుడిగా పదవీ కాలం ముగిసిన తరువాత విఠల్‌కు టీఎస్‌పీఎస్పీ చైర్మన్ లేదా ఏదైనా కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇస్తారని తెలంగాణ రాజకీయాల్లో ప్రచారం కూడా జరిగినా అది సాధ్యం కాలేదు. మరోవైపు రాష్ట్రంలో ఉద్యోగాల నియామకాల పట్ల కేసీఆర్ సర్కార్ తీరును ఆయన ముందునుంచి తప్పుపడుతున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు రూపొందించిన పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు డిజైన్ మార్చడాన్ని విమర్శించారు. జిల్లా ప్రజాప్రతినిధులు, ఉద్యమ నేతలతో జరిగిన అంతర్గత చర్చల్లోనూ ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఎండగట్టారు. ఉద్యోగాల నోటిఫికేషన్లు విడుదల చేసే విషయమై చర్చించేందుకు సీఎం కేసీఆర్ అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవడంతో విఠల్ తీవ్రస్థాయిలో అసంతృప్తికిలోనయ్యారు. ఇదే అదనుగా విఠల్‌ను సంప్రదించిన బీజేపీ నేతలు పార్టీలోకి ఆహ్వానించారు కమలం నేతలు. బీసీ సామాజిక వర్గానికి చెందిన విఠల్ చేరికతో తెలంగాణ బీజేపీలో మరింత బలపడే అవకాశాలున్నాయని నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Former president of Telangana Employees Association Shri Ch Vittal joins BJP at party headquarters in New Delhi. https://t.co/b0viL7BazL
— BJP (@BJP4India) December 6, 2021
2023 టార్గెట్‌గా తెలంగాణ బీజేపీ గ్రౌండ్ ప్రీపేర్ చేస్తోందా? ఇప్పటి నుంచే అభ్యర్థుల వేట మొదలుపెట్టిందా? అంటే అవుననే అనిపిస్తోంది. ఈటల రాజేందర్ గెలుపుతో పార్టీ శ్రేణులు ఉత్సాహం మీదున్నాయా అంటే అవునని అంటున్నాయి కమలం శ్రేణులు. అధికార పార్టీతో పోటీ పడేది తామే అంటున్న కమలనాథలు.. గెలుపు వ్యూహాలు రచిస్తున్నారట. గత రెండేళ్లలో కొన్ని చోట్ల గెలుపులు తెలంగాణ బీజేపీలో కొత్త జోష్ నింపాయి. ఇదే ఊపు కంటిన్యూ చేయాలనుకుంటోంది బీజేపీ. రాష్ట్రంలో ఇప్పట్లో ఎన్నికలేవి లేవు. అందుకే ఇక 2023 తమ టార్గెట్ అంటోంది కమలం పార్టీ. బీజేపీలో మరికొందరు చేరబోతున్నారనే ప్రచారం మధ్య విఠల్ చేరడం.. రాజకీయంగా బలం చేకూరుతోంది.
ఇవి కూడా చదవండి: Health Benefits: అయ్యో..! నలుపు అని ఫీల్ అవుతున్నారా.. ఇందులో ఆశ్చర్యకరమైన వాస్తవాలు దాగున్నాయి..