ఈ జిల్లా గులాబీ అడ్డా.. సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరిన మాజీమంత్రి హరీష్‌ రావు..

తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో భాగంగా మెదక్ రోడ్ షోలో ఎమ్మెల్యే హరీష్ రావు సంచలన కామెంట్స్ చేశారు. అమరవీల స్థూపం వద్దకు రాజీనామా పత్రంతో తాను వస్తానని.. నువ్వు వస్తావా.. అని ప్రశ్నించారు. ఆగష్టు 15 లోపు రుణమాఫీ చేయడం నిజమైతే, ఆరు హామీలు అమలు చేయడం నిజం అయితే అమరవీరుల స్థూపం వద్దకు రా.. రాజీనామా లేఖలను ఇద్దరం మేధావుల చేతిలో పెడదామన్నారు. నువ్వు చెప్పినవి అమలు చేస్తే తన రాజీనామా లేఖను ఆ మేధావులు, స్పీకర్‎కి ఇస్తారు.

ఈ జిల్లా గులాబీ అడ్డా.. సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరిన మాజీమంత్రి హరీష్‌ రావు..
Harish Rao
Follow us

|

Updated on: Apr 25, 2024 | 3:01 PM

తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో భాగంగా మెదక్ రోడ్ షోలో ఎమ్మెల్యే హరీష్ రావు సంచలన కామెంట్స్ చేశారు. అమరవీల స్థూపం వద్దకు రాజీనామా పత్రంతో తాను వస్తానని.. నువ్వు వస్తావా.. అని ప్రశ్నించారు. ఆగష్టు 15 లోపు రుణమాఫీ చేయడం నిజమైతే, ఆరు హామీలు అమలు చేయడం నిజం అయితే అమరవీరుల స్థూపం వద్దకు రా.. రాజీనామా లేఖలను ఇద్దరం మేధావుల చేతిలో పెడదామన్నారు. నువ్వు చెప్పినవి అమలు చేస్తే తన రాజీనామా లేఖను ఆ మేధావులు, స్పీకర్‎కి ఇస్తారు. ఒకవేళ చేయకుంటే నీ రాజీనామా లేఖను గవర్నర్‎కు ఇస్తారని తెలిపారు. నువ్వు మాట మీద నిలబడే వాడివి అయితే రా అంటూ సవాల్ విసిరారు. ఉద్యమ కారులు అంటే బిఆర్ఎస్ పార్టీ అని కొనియాడారు. బీఆర్ఎస్ నాయకులను చూస్తే ఎండ కూడా బయపడుతున్నది అంటూ తమ శక్తి, స్థాయి గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. 25 ఏళ్ళుగా మెదక్‎లో గులాబి జెండా ఎగురుతున్నది. ఇతర జెండాలేవీ ఎగురలేదని గుర్తు చేశారు. మెదక్ జిల్లా గులాబి అడ్డా. మళ్ళీ బిఆర్ఎస్ గెలువబొతున్నదని జోస్యం చెప్పారు.10 ఎళ్ళలో కేసీఆర్ ఏం చేశారని సీఎం రేవంత్ రెడ్డి అడుగుతున్నారు. కేసీఆర్ వల్లనే జిల్లా అయ్యింది. కొత్తగా నిర్మించిన కలెక్టరేట్ భవనం నిర్మించబడిందని చెప్పారు. కాబట్టే నామినేషన్‎కు మెదక్‎కు వచ్చినట్లు తెలిపారు.

మెదక్‎ను ఇందిరా గాంధీ అభివృద్ది చేసిందని పచ్చి అబద్ధాలు చెబుతున్నారన్నారు. సందర్భం వచ్చినప్పుడల్లా పేగులు మెడలో వేసుకుంటా అంటున్నారు. అలా రాక్షసులు వేసుకుంటారని, సీఎం రేవంత్ తన స్థాయిని తగ్గించుకొని మాట్లాడుతున్నారన్నారు. మెదక్ అభివృద్ది గురించి మాట్లాడే హక్కు సీఎం రేవంత్‎కు లేదని చెప్పారు. తెలంగాణలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేసి, మెడికల్ కాలేజీలు తెచ్చింది కేసీఆర్ అని ఈ సందర్భంగా మరోసారి చెప్పారు. అందమైన నాలుగు లైన్ రహదారి తీసుకు వచ్చింది బీఆర్ఎస్ పార్టీ అని గుర్తు చేశారు. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీ అమలు అని బాండ్ పేపర్ మీద రాసారు. ఇప్పడు బాండ్ పేపర్ పరువు తీశారు అని ఎద్దేవా చేశారు. ఈ ముఖ్యమంత్రికి తన ఎత్తు గురించి ఉన్న ధ్యాస రైతుల సమస్య పట్ల లేదని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 200 పైగా రైతులు చనిపోయారు. ఆటో కార్మికులు 30 మంది చనిపోయారని.. వారిని పరామర్శించకుండా ఢిల్లీలో తిరుగుతారని కౌంటర్ వేశారు. బిజెపి రఘునందన్ మాటలు నమ్మడమంటే నీళ్లు లేని బావిలో దూకడమే అని విమర్శించారు. దుబ్బాకలో అలాగే మాట్లాడితే అక్కడ ప్రజల బుద్ధి చెప్పారని తెలిపారు. బిజెపి ఏ వర్గాలకు మేలు చేయలేదని విమర్శించారు. బీఆర్ఎస్ గెలిస్తేనే కాంగ్రెస్ వాళ్ళ మెడలు ఒంచడం సాధ్యమవుతుందన్నారు. కాంగ్రెస్ వాళ్లను భూమి మీద దించాలంటే వెంకట్రామ రెడ్డిని గెలిపించాలని కోరారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…