BSP చీఫ్ నియామక కసరత్తు పూర్తయ్యింది. స్టేట్ ప్రెసిడెంట్‌గా మాజీ IPS ప్రవీణ్‌కుమార్ పేరు దాదాపు ఖరారైంది. RS పేరును అధికారికంగా ప్రకటించింది హైకమాండ్. తెలంగాణ BSP ఇన్‌చార్జి రాంజీగౌతమ్ సమక్షంలో రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్నారు ప్రవీణ్‌కుమార్. ఇప్పుడు BSP తెలంగాణ స్టేట్ చీఫ్ కోఆర్డినేటర్‌గా ప్రవీణ్‌కుమార్ కొనసాగుతున్నారు. ఉద్యోగానికి రాజీనామా చేసి సంచలనం సృష్టించిన ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్.. రాజకీయాలపై ఫోకస్ పెట్టారు. ఉద్యోగాన్ని వదలుకున్న తర్వాత ఆయన కొత్త పార్టీ పెడతారన్న ఊహాగానాలు వెలువడ్డాయి. అందరి అంచనాల్ని తలకిందులు చేస్తూ.. అనూహ్యంగా BSPలో చేరారు. అప్పటి నుంచీ అధికార పార్టీ విధానాలపై విమర్శలు చేస్తూ వస్తున్నారు. జిల్లాల పర్యటనలతో ప్రజల్లోకి వెళ్తున్నారు RS ప్రవీణ్‌కుమార్.
శాసనసభా..? పార్లమెంటా..? అనేది సస్పెన్స్..
ఐపీఎస్ ఆఫీసర్‌గా బాధ్యతల నిర్వహణలో తనదైన ముద్ర వేశారు. రాష్ట్రస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. అనూహ్యంగా ఉద్యోగానికి గుడ్‌బై చెప్పి.. ప్రజాక్షేత్రంలోకి దిగారు. బహుజనుల కోసమంటూ.. బహుజన్‌సమాజ్ పార్టీలో చేరిన ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్. తెలంగాణలో బహుజన్ సమాజ్ పార్టీ పగ్గాలు చేపట్టిన మాజీ ఐపీఎస్ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్.. వచ్చే ఎన్నికల్లో ఎక్కణ్నుంచి పోటీ చేయబోతున్నారనేదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆయన గురి శాసనసభా..? పార్లమెంటా..? అనేది సస్పెన్స్‌గా మారింది. ఒకవేళ అసెంబ్లీలో అడుగుపెట్టాలనుకుంటే, ఎక్కడి నుండి ఆయన పోటీకి సుముఖంగా వున్నారు..? పార్లమెంటుకైతే ఏ స్థానాన్ని ఎంచుకుంటారు? అనే చర్చ కూడా జోరుగా జరుగుతోంది.