గుత్తికోయలపై అధికారుల ఆటివిక దాడి.. గిరిజనుల గుడిసెలు పీకి.. నిప్పంటించిన అటవీ అధికారులు

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అటవీశాఖ సిబ్బంది బీభత్సం సృష్టించారు. గుత్తి కోయ గిరిజనుల ఇళ్లను నేల మట్టం చేసి వారిని నిరాశ్రయులను..

గుత్తికోయలపై అధికారుల ఆటివిక దాడి.. గిరిజనుల గుడిసెలు పీకి.. నిప్పంటించిన అటవీ అధికారులు

Updated on: Feb 19, 2021 | 5:25 PM

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అటవీశాఖ సిబ్బంది బీభత్సం సృష్టించారు. గుత్తి కోయ గిరిజనుల ఇళ్లను నేల మట్టం చేసి వారిని నిరాశ్రయులను చేశారు. అడ్డుకున్న గుత్తికోయ గిరిజనులపై అటవీశాఖ ఖావరాన్ని ప్రదర్శించారు. అటవీశాఖ సిబ్బంది దాడిలో ఓ బాలింతకు గాయాలవగా వెంటనే ఆస్పత్రికి తరలించారు.

ఈ సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల మండల కేంద్రానికి సమీపంలో జరిగింది. ఛత్తీస్ గడ్ రాష్ట్రం నుంచి పొట్టచేత పట్టుకొని వలస వచ్చిన గుత్తికోయ గిరిజనులు పలిమెల సమీపంలో గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్నారు. సుమారు ఐదేళ్ల క్రితం ఈ ప్రాంతానికి వలస వచ్చారు. పలిమెల నుండి కామనపల్లి వేళ్లే మార్గంలో అటవీ ప్రాంతంలో గుడిసెలు వేసుకున్నారు. విషయం తెలుసుకున్న అటవీ అధికారులు ఆ గుడిసెలు కూల్చివేసి ఇంటిపై కప్పుకున్న తాటి కమ్మలకు నిప్పంటించారు. ఈ క్రమంలో గుత్తి కోయలకు – అటవీశాఖ సిబ్బందికి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.

అటవీశాఖ సిబ్బంది అతి ఉత్సాహంతో సావిత్రి అనే గిరిజన బాలింతకు తీవ్ర గాయాలయ్యాయి. ఆ బాలింత స్పృహ తప్పి పడిపోవడంతో మహాదేవపూర్ సామాజిక ఆస్పత్రికి తరలించారు. నిబంధనలకు విరుద్ధంగా రిజర్వ్ ఫారెస్ట్ లో గుడిసెలు వేసుకోవడంతో పాటు, అడవులను నరుకుతుండడం వల్లే వారిని ఇక్కడి నుంచి మైదాన ప్రాంతానికి వెల్లగొడుతున్నామని అటవీశాఖ సిబ్బంది తెలిపారు.

Read more:

సైబరాబాద్‌ పోలీసుల సంచలన నిర్ణయం.. బైక్ వెనక కూర్చున్న వ్యక్తికి హెల్మెట్ లేకుంటే లైసెన్స్ రద్దు !