తొలివిడత రౌండప్ : ఏపీ పంచాయతీ ఎన్నికల్లో అత్యధికంగా చిత్తూరు జిల్లా నుంచి 110 ఏకగ్రీవం

ఏపీలో తొలి విడత నామినేషన్ల ఘట్టం ముసిగింది. చాలా చోట్ల ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అత్యధికంగా చిత్తూరు జిల్లా నుంచి 110 మంది అభ్యర్థులు..

తొలివిడత రౌండప్ : ఏపీ పంచాయతీ ఎన్నికల్లో అత్యధికంగా చిత్తూరు జిల్లా నుంచి 110  ఏకగ్రీవం
Follow us

|

Updated on: Feb 05, 2021 | 5:29 AM

ఏపీలో తొలి విడత నామినేషన్ల ఘట్టం ముసిగింది. చాలా చోట్ల ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అత్యధికంగా చిత్తూరు జిల్లా నుంచి 110 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు తెలుస్తోంది. ఏపీ పంచాయితీ ఎన్నికల్లో మొత్తం 3,249 గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం నోటిఫికేషన్‌ జారీ చేయగా, 19 491 మంది సర్పంచ్‌ పదవి కోసం, 79, 799 మంది వార్డు సభ్యుల కోసం నామినేషన్లు దాఖలు చేశారు. అయితే సర్పంచ్‌ నామినేషన్లలో 1323 నామినేషన్లు తిరస్కరించినట్టు తెలుస్తోంది. 18,168 మాత్రమే సరిగా ఉన్నాయని ఎన్నికల అధికారులు నిర్థారించారు.

తొలి విడతలో విజయనగరం జిల్లా మినహా మిగతా 12 జిల్లాల్లో ఎన్నికల కోసం నోటిఫికేషన్‌ విడుదలయింది. ఇందులో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 454 పంచాయతీలున్నాయి. ఇక్కడే 110 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు తెలుస్తోంది. అనంతపురం జిల్లాలో అత్యల్పంగా ఆరుగురు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చిత్తూరు జిల్లాలో 2,499 మంది వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

శ్రీకాకుళం జిల్లాలో 321 పంచాయతీలకు 39 ఏకగ్రీవమయ్యాయి. విశాఖ జిల్లాలో 340 పంచాయతీలకు 44 ఏకగ్రీవమయ్యాయి. తూర్పుగోదావరి జిల్లాలో 366కు 30 ఏకగ్రీవమయ్యాయి. పశ్చిమగోదావరి జిల్లాలో 239 పంచాయతీలకు 41 మంది సర్పంచ్‌ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు తెలుస్తోంది. కృష్ణా జిల్లాలో 234 పంచాయతీలకు, 23 మంది అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు.

అటు గుంటూరు జిల్లాలో 337 పంచాయతీలకు 67 మంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రకాశం జిల్లాలో 227కు 35 మంది ఏకగ్రీవమయ్యారు. నెల్లూరు జిల్లాలో 163 పంచాయతీలకు 25 ఏకగ్రీవమయ్యాయి. కడప జిల్లాలో 206 పంచాయతీలకు 51 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కర్నూలు జిల్లాలో 193 పంచాయతీలకు 52 మంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగతా సర్పంచ్‌, వార్డు సభ్యుల ఎన్నిక కోసం ఈనెల 9న పోలింగ్‌ జరగనుంది.

అన్నదాత కోసం: సాగుచట్టాలపై టీఆర్ఎస్ నేతల మరో స్వరం, మళ్లీ రైతు ఉద్యమానికి మద్ధతు తెలుపుతోన్న సూచనలు

తెలుగు రాష్ట్రాల్లో పెరిగిపోయిన చలి తీవ్రత, ఏజెన్సీ ప్రాంతాల్లో చలితో గజగజ వణికిపోతున్నారు గిరిజనం

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు